Thursday, September 17, 2026 03:12 PM
Thursday, September 17, 2026 03:12 PM

చంద్రబాబుపై కేంద్ర మంత్రి ఇంట్రస్టింగ్ కామెంట్స్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్ పర్యటన రాజకీయంగా, ఆధ్యాత్మికంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. యూపీలో నిర్వహించిన ‘వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదే వేదికపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read : నేను లండన్ వెళ్తా ప్లీజ్.. రమా నందన రిక్వస్ట్..!

ఈ సందర్భంగా కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడుతో తమ కుటుంబానికి ఉన్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన తండ్రి, దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్‌కు చంద్రబాబు అత్యంత సన్నిహితుడని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లోనే కాకుండా, వ్యక్తిగతంగా కష్టసుఖాలు ఎదురైన ప్రతిసారీ తమ కుటుంబానికి చంద్రబాబు కొండంత అండగా నిలిచారని చిరాగ్ పాశ్వాన్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాంటి సీనియర్ నేత తమకు పెద్ద దిక్కుగా ఉండటం సంతోషంగా ఉందన్నారు.

Also Read : గ్రామాల్లో అభివృద్ధి పండుగ, పవన్ కృషితో మారుతున్న రూపురేఖలు..!

ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు వారణాసిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దర్శనంలో చంద్రబాబుతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వీరంతా కలిసి కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకుని, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. దేశం, రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

కూటమిలో చిచ్చు పెట్టిన...

అధికార కూటమిలో పైకి సమన్వయం కనిపిస్తున్నా.....

పాపం బొత్స.. రాజకీయ...

విజయనగరం జిల్లాలో ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది....

ఈ అరుదైన రికార్డ్...

తిరుమల వేంకటేశ్వరుడు సీఎం చంద్రబాబు ఇష్టదైవం.....

పోల్స్