తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెందిన సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై రెవెన్యూ శాఖ విచారణను తీవ్రతరం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా జారీ చేసిన 30 రోజుల డెడ్‌లైన్ ఆదేశాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో కసరత్తు ముమ్మరం చేశారు. తాజా సమాచారం ప్రకారం, గురువారం ఉదయం ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ సుదర్శన్, గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ మర్కూక్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.
Also Read : చంద్రబాబుపై కేంద్ర మంత్రి ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
ఫామ్‌హౌస్‌కు సంబంధించిన పాత, కొత్త భూ రికార్డుల ఫైళ్లను వెలికితీసి నిశితంగా పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్న ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, మరియు పట్టా భూముల వివరాల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. వివాదాస్పదంగా మారిన సర్వే నంబర్లలోని సరిహద్దులను తేల్చేందుకు రెవెన్యూ అధికారులు ఆధునిక సాంకేతికతను వాడుతున్నారు. గూగుల్ ఎర్త్ మ్యాప్స్ మరియు పాత శాటిలైట్ చిత్రాల ఆధారంగా గతంలో అక్కడ ఉన్న భూముల పరిస్థితి ఏమిటి..? కాలక్రమేణా ఫామ్‌హౌస్ సరిహద్దులు ఎలా మారాయి..? అనే అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు.
Also Read : రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ పంచాయతీ..!
త్వరలోనే కేసీఆర్‌కు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ రికార్డుల ప్రకారం కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరిట 295 ఎకరాలు మాత్రమే ఉండాలని, కానీ ప్రస్తుతం అది దాదాపు 700 ఎకరాల్లో విస్తరించి ఉందని ఆరోపించారు. ఫామ్‌హౌస్ పరిధిలోని సర్వే నంబర్ 325 లో సుమారు 388 ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూమి ఉందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ పేరిట ఈ భూమిని రికార్డుల నుంచి మాయం చేసి ఫామ్‌హౌస్‌లో కలిపేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ 30 రోజుల విచారణలో అది ప్రభుత్వ భూమి అని తేలితే, ఆక్రమణలను తొలగించి, ఆ భూమిని స్వాధీనం చేసుకుని 800 మంది దళిత కుటుంబాలకు అర ఎకరం చొప్పున పంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ఈ భూములపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.

