Friday, September 25, 2026 09:29 PM
Friday, September 25, 2026 09:29 PM

వరద ఉధృతిలో చిక్కుకున్నటీడీపీ ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ..!

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరద ముంపు పరిశీలనకు వెళ్లిన అధికార యంత్రాంగానికి పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని బూర్జ మండలం, అల్లిన గ్రామంలో వరద ఉధృతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లిన ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు ఒక్కసారిగా వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. వరద నీరు ఊహించని విధంగా పోటెత్తడంతో కాసేపు అక్కడ తీవ్ర ఉత్కంఠ, హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Also Read : చవితి ఉత్సవాల్లో కుల వివక్ష..!

అధికారులు వరదలో చిక్కుకున్నారనే సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రక్షణ బృందాలు అత్యంత వేగంగా రంగంలోకి దిగాయి. లైఫ్ జాకెట్లు, ప్రత్యేక బోట్లతో ఘటనా స్థలానికి చేరుకున్న రక్షణ సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ చాకచక్యంగా వ్యవహరించి ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్, ఎస్పీ సహా అధికారులందరినీ సురక్షితంగా వరద నీటి నుంచి బయటకు తీసుకొచ్చారు.

Also Read : ఎన్నికల కమిషన్‌లో ముదిరిన వివాదం..!

రక్షణ బృందాలు సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నప్పటికీ ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్, ఎస్పీలు వెనక్కి తగ్గకుండా.. జిల్లాలోని ఇతర ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు తగ్గిన నేపధ్యంలో సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

పార్టీ అధ్యక్షుడి కంటే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,...

ఫిరాయింపులలో తెలంగాణా వరస్ట్...

భారత రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై...

గుండె పోటు కాదు.....

చనిపోయింది గుండెపోటుతో.. ఈ విషయాన్ని వైద్యులు...

మజ్లీస్ నుంచి దానం...

తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ...

పవన్-రాధా భేటీ వెనుక...

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్...

పోల్స్