Friday, September 25, 2026 09:59 PM
Friday, September 25, 2026 09:59 PM

చవితి ఉత్సవాల్లో కుల వివక్ష..!

పండుగలంటే.. అంతా కలిసి జరుపుకునేవి. ఇక ఉత్సవాలు అయితే.. చిన్నా పెద్దా అనే భేదం లేకుండా కుల వివక్షకు తావివ్వకుండా అంతా కలిసిమెలిసి జరుపుకుంటారు. అలా సరదాగా పండుగ జరుపుకోవాల్సిన చోట ఇప్పుడు కుల వివక్షకు తెర లేపడం పెద్ద వివాదానికి కారణమైంది. తెలంగాణలోని సిద్ధిపేట  జిల్లా ఇమామ్ బాద్ గ్రామంలో వినాయక చవితి వేడుకల సందర్భంగా జరిగిన ఒక దారుణమైన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పండుగ వాతావరణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో కొందరు నిర్వాహకులు బహిరంగంగా కుల వివక్షను ప్రదర్శించారు. అందరికీ సమానంగా భోజనాలు పెట్టాల్సిన చోట దళితులను, అగ్రవర్ణాల వారిని వేర్వేరుగా టేబుళ్లు వేయటం ఇప్పుడు దుమారం రేపుతోంది.

Also Read : ఐటీసీపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.. కారణం..?

ఈ దారుణమైన పద్ధతిని గమనించిన ఒక యువకుడు వెంటనే నిర్వాహకులను నిలదీశాడు. కులాల వారీగా టేబుళ్లను వేరు చేసి భోజనాలు వడ్డించడం ఏమిటని ప్రశ్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఆధునిక కాలంలో కూడా సమాజంలో ఇంకా ఈ అసమానతలను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవత్వం చాటుకోవాల్సిన వేడుకల్లో ఇలాంటి వివక్ష చోటు చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీడియో తీస్తున్న యువకుడితో కొందరు స్థానికులు వాగ్వాదానికి దిగారు. తాము చిన్నతనం నుంచి ఇలాగే వేర్వేరుగా వడ్డిస్తున్నామని, దీనికి రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమాజంలో చదువుకున్నాక కూడా మనుషుల మధ్య గోడలు కట్టడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు నిలదీస్తున్నారు. అక్కడున్న జనాల్లో కొందరు యువకుని తీరును సమర్థించగా, మరికొందరు పాత పద్ధతులే కొనసాగాలని వాదించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పౌర సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రజా సంఘాల నాయకులు, హక్కుల కార్యకర్తలు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి ఈ ఘటనపై సుమోటాగా కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కేసీఆర్, ప్రస్తుతం హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట నియోజకవర్గంలోనే ఈ కుల వివక్ష వ్యవహారం వెలుగులోకి రావడంతో.. ఇది రాజకీయ దుమారం కూడా రేపుతోంది.

Also Read : పవన్-రాధా భేటీ వెనుక టీడీపీ మాస్టర్ ప్లాన్..?

భారతీయ రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులను కల్పించినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించినా ఇలాంటి ఘటనలు తరచూ ఏదో ఒక రూపంలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సిద్దిపేట ఇమామ్ బాద్‌లో జరిగిన ఈ దారుణం వ్యవస్థలోని లోపాలను మరోసారి బట్టబయలు చేసింది. అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెబుతున్న తరుణంలో ఇలాంటి ఛాందస భావాలు ఉండటం సిగ్గు చేటు. కేవలం ప్రభుత్వాల చట్టాలు మాత్రమే కాకుండా ప్రజల మానసిక స్థితిలో సంపూర్ణ మార్పు రావాలి. చిన్న పిల్లల ముందు పెద్దలు ఇలాంటి వివక్షా పూరిత పనులు చేయడం వల్ల రాబోయే తరాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందరూ కలిసిమెలిసి ఉండాల్సిన పండుగ రోజుల్లో ఇలాంటి వర్గ భేదాలు సృష్టించడం విచారకరం. ఈ సామాజిక రుగ్మతను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు మేల్కొని ఇలాంటి కుల వివక్షా కార్యక్రమాలపై కఠినమైన నిఘా పెట్టాలని కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంకా వేళ్లూనుకుని ఉన్న కుల దురహంకారాన్ని నిర్మూలించడానికి ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

పార్టీ అధ్యక్షుడి కంటే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,...

ఫిరాయింపులలో తెలంగాణా వరస్ట్...

భారత రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై...

వరద ఉధృతిలో చిక్కుకున్నటీడీపీ...

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా...

గుండె పోటు కాదు.....

చనిపోయింది గుండెపోటుతో.. ఈ విషయాన్ని వైద్యులు...

మజ్లీస్ నుంచి దానం...

తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ...

పోల్స్