Friday, November 13, 2026 06:00 PM
Friday, November 13, 2026 06:00 PM

గిరిజనుల అభిమానం పవన్ కు ఓట్లుగా ఎందుకు మారలేదు?

గిరిజనులను ఆకట్టుకునేందుకు పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అల్లూరి జిల్లా, అరకు, పోలవరం వంటి కీలక ప్రాంతాల్లో వైసీపీ తన పట్టు నిలబెట్టుకుంది. క్షేత్రస్థాయి నాయకత్వ వైఫల్యం, సమన్వయ లోపాలు, కొందరు నేతలపై వచ్చిన ఆరోపణలు జనసేన ఎదుగుదలకు అడ్డంకిగా మారాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గిరిజనులను ఆకట్టుకునే విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అందరికన్నా ముందున్నారనడంలో సందేహం లేదు. వారి కష్టాలు తెలుసుకున్నారు. వారిలో ఒకరిగా కలిసిపోయారు. గ్రామాల్లో పర్యటించారు. చెప్పులు పంపించారు. తినుబండారాలు పంపించారు. మామిడికాయలు కూడా పంపించి తన ఆత్మీయతను చాటుకున్నారు. ఇదే సమయంలో గిరిపుత్రులకు అత్యంత కీలకమైన ప్రాంతాల్లో రహదారులు కూడా వేయించారు. తద్వారా.. మునుపు ఎన్నడూ లేని విధంగా గిరిజనంలో జనసేనకు ప్రధాన పాత్ర కల్పించారు.

Also Read : లోకేష్ వర్సస్ వైసీపీ.. ఎవరు గెలుస్తారో..?

ఇక, రాజకీయంగా ఏం చేసినా.. అంతిమంగా అది ఓటు బ్యాంకుగా మారినప్పుడే ఫలితం వస్తుంది. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కూడా.. కాకినాడ సభలో స్పష్టం చేశారు. “మనం ఎంతో పుంజుకున్నామని అనుకున్నా.. అది ఓటు బ్యాంకుగా మారకపోతే.. ఇబ్బందులు వస్తాయి.” అని పవన్ తేల్చి చెప్పారు. అయితే.. ఇప్పుడు ఇదే గిరిజన ప్రాంతాల్లో జనసేన గ్రాఫ్ ఎలా ఉంది? అనేది కీలకం. నిజానికి గిరిజనులు ఒక్కసారి విశ్వసిస్తే.. కొన్ని దశాబ్దాల పాటు వారు కడుపులో పెట్టుకుంటారు. ఇదే పరిణామం జనసేనకు కూడా వర్తిస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీపై ఏర్పడిన అభిమానం.. తర్వాత కాలంలో వైసీపీకి అనుకూలంగా మారింది. అలానే జనసేనపై గిరిజనులు చూపించే అభిమానం కూడా ఓటు బ్యాంకుగా మారుతుందని అంతా అంచనా వేసుకున్నారు.

Also Read : గుజరాత్ ను వీడి హార్దిక్ తప్పు చేసాడా..?

అయితే.. దీనికి భిన్నంగా క్షేత్ర స్థాయిలో అల్లూరి జిల్లా, అరకు, పోలవరం వంటి కీలకమైన గిరిజన మన్యం ప్రాంతాల్లో వైసీపీ తన హవా నిలబెట్టుకోగా.. జనసేన భారీ అంచనాలు ఒకరకంగా సాకారం కాలేదనే చెప్పాలి. పై స్థాయిలో అధినేత ఎంత ప్రయత్నం చేసినా.. క్షేత్ర స్థాయిలో దాని ఫలితాలను ప్రజల మద్యకు తీసుకువెళ్లే బాధ్యత నాయకులపైనే ఉంటుంది. ఈ విషయంలోనే జనసేన నాయకులు విఫలమయ్యారన్నది వాస్తవం. దీనిని ఆ పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. అలానే. క్షేత్ర స్థాయిలో సమన్వయ లోపాలు.. కొందరు నాయకులపై వచ్చిన ఆరోపణలు వంటివి కూడా.. పార్టీని పుంజుకునే విషయంలో బ్రేకులు వేశాయి. ఇక, ఈ పరిణామాలను సరిచేసుకుంటేనే తప్ప.. గిరిజన ప్రాంతాల్లో జనసేన మరింత పుంజుకునే అవకాశం తక్కువగానే ఉందని అంటున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

సీఐఐ సమ్మిట్‌లో లోకేష్,...

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య...

‘ఇట్లు అర్జున’ రివ్యూ...

‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’...

కూటమిలో పంచాయతీ కుంపట్లు..!

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఇప్పటి...

పెట్టుబడుల వేటలో మంత్రి...

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య...

లోకల్ వార్‌లో మంత్రుల...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు...

లోకేష్ వర్సస్ వైసీపీ.....

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా...

పోల్స్