Friday, November 13, 2026 03:31 PM
Friday, November 13, 2026 03:31 PM

పెట్టుబడుల వేటలో మంత్రి లోకేష్ దూకుడు..!

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు రెండో రోజున రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణలో తనదైన దూకుడు ప్రదర్శించారు. ఇందులో భాగంగా ప్రముఖ రక్షణ రంగ సంస్థ ‘సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్’ ఫౌండర్ కెప్టెన్ నికుంజ్ పరాశర్‌తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని రక్షణ మరియు సముద్ర సాంకేతికతకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పలు కీలక ప్రతిపాదనలను మంత్రి ఆయన ముందుంచారు.

Also Read : ఈసీ టార్గెట్ ఆ జిల్లాలే.. పల్నాడుపైనే స్పెషల్ ఫోకస్..!

ముఖ్యంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ‘మారిటైమ్ అటానమీ సెంటర్’తో పాటు ‘రోబోటిక్స్ స్కిల్లింగ్ సెంటర్’ను ఏర్పాటు చేయాలని, తద్వారా జువ్వలదిన్నెను మానవరహిత నౌకల తయారీ మరియు ఎగుమతుల హబ్‌గా అభివృద్ధి చేయాలని లోకేష్ సూచించారు. యువతకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించేందుకు ఐఐటీ తిరుపతి మరియు ఆంధ్రా విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. అంతేకాకుండా, తూర్పు నౌకాదళం, కోస్ట్‌గార్డ్ అవసరాలకు అనుగుణంగా జువ్వలదిన్నెలో సీ ట్రయల్స్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read : లోకల్ వార్‌లో మంత్రుల సొంత లెక్కలు.. వైసీపీ రివర్స్ వ్యూహం..!

హార్బర్ భద్రత, హైడ్రోగ్రాఫిక్ సర్వేలతో పాటు కృష్ణా-గోదావరి బేసిన్‌లో ఆఫ్‌షోర్ తనిఖీల కోసం సాగర్ డిఫెన్స్ రూపొందించే మానవరహిత నౌకల సేవలను వినియోగించుకునే అంశంపై చర్చించారు. తుపాన్లు, వరదల వంటి విపత్తుల సమయంలో సహాయక చర్యల కోసం రోబోటిక్స్ మరియు డ్రోన్ల వినియోగాన్ని పెంచాల్సిన అవసరాన్ని లోకేష్ వివరించారు. ఇదే క్రమంలో ఎండ్యూర్ ఎయిర్, సాగర్ డ్రోన్ల తయారీ కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించాలని కెప్టెన్ నికుంజ్ పరాశర్‌ను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. వీటికి అనుబంధంగా నెల్లూరు జిల్లాలో కాంపోజిట్స్, బ్యాటరీలు, సెన్సార్ల సరఫరా పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలపై సానుకూలంగా స్పందించిన నికుంజ్ పరాశర్, మంత్రి లోకేష్ చేసిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

కూటమిలో పంచాయతీ కుంపట్లు..!

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఇప్పటి...

లోకల్ వార్‌లో మంత్రుల...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు...

లోకేష్ వర్సస్ వైసీపీ.....

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా...

ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.....

పల్నాడు రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

పారిశ్రామిక రంగంలో గేమ్...

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య...

ఈసీ టార్గెట్ ఆ...

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మిగిలిన పట్టణ...

పోల్స్