అంతర్జాతీయ క్రికెట్లో తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దిల్లీ వేదికగా ఆయన రాష్ట్రీయ లోక్ దళ్ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌధరితో ప్రత్యేకంగా సమావేశం కావడమే ఈ తాజా రాజకీయ చర్చకు కారణమైంది. సెప్టెంబర్ 20 న జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుండటంతో షమీ పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించడం ఖాయమనే ప్రచారం సాగుతోంది.
Also Read : టీవీ9లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తున్న రవి ప్రకాష్..?
రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్రోహా నియోజకవర్గం నుంచి ఆర్ఎల్డీ తరఫున మహమ్మద్ షమీ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. షమీ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా కావడంతో, ఆ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ స్థానానికి సమాజ్‌వాదీ పార్టీ నేత మెహబూబ్ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో బెంగాల్ ఎన్నికల సమయంలో అతను పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.
Also Read : ఎర్రవల్లిలో ఊపందుకున్న భూముల సర్వే..!
ప్రస్తుతం జయంత్ చౌధరితో జరిగిన ఈ తాజా భేటీపై అటు మహమ్మద్ షమీ కానీ, ఇటు ఆర్ఎల్డీ పార్టీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఫిట్నెస్ కారణాల వల్ల అంతర్జాతీయ క్రికెట్‌కు కాస్త దూరంగా ఉన్న షమీ, ఇటీవల దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఒకవేళ ఈ ప్రచారం నిజమై షమీ గనుక నేరుగా రాజకీయ రణరంగంలోకి దూకితే, మైదానంలో యార్కర్లతో బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేసినట్లే, రాజకీయ పిచ్‌పై కూడా ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటాడనేది ఇప్పుడు క్రీడా మరియు రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

