రెండు సార్లు వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ వేదికపై మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2027లో జరగబోయే ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించే సువర్ణావకాశాన్ని విండీస్ జట్టు చేజార్చుకుంది. తాజాగా బెల్ఫాస్ట్లో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ జట్టు సాధించిన అద్భుత విజయం.. వెస్టిండీస్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాప్-8 స్థానాల్లో తన ప్లేస్‌ను మరింత పటిష్టం చేసుకోగా.. ప్రస్తుతం 10వ స్థానంలో ఉన్న వెస్టిండీస్ రేసు నుండి వెనుకబడిపోయింది.
Also Read : మార్కాపురం జిల్లాకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్..!
ఐసీసీ నిబంధనల ప్రకారం.. సెప్టెంబర్ 30, 2026 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచే జట్లు.. ఆతిథ్య దేశాలైన సౌత్ ఆఫ్రికా, జింబాబ్వేలతో కలిపి నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. అయితే ప్రస్తుతం 10వ స్థానంలో ఉన్న వెస్టిండీస్.. కట్-ఆఫ్ తేదీ కంటే ముందు భారత్‌తో మరో రెండు వన్డేలు ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచ్‌ల్లో విండీస్ గెలిచినప్పటికీ, ర్యాంకింగ్స్ సమీకరణాల ప్రకారం వారు టాప్-8 లోకి రావడం అసాధ్యంగా మారింది. దీంతో ఫిబ్రవరి 2027లో జరగబోయే క్వాలిఫికేషన్ టోర్నమెంట్ ద్వారానే విండీస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది.
Also Read : ప్రకాష్ రాజ్ కు ఎన్నికల సంఘం షాక్..!
వెస్టిండీస్ జట్టు ఇలా క్వాలిఫైయర్స్ రౌండ్ ఆడాల్సి రావడం ఇది మొదటిసారేం కాదు, గతంలోనూ వారికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. 2023 వన్డే ప్రపంచ కప్ కోసం కూడా విండీస్ జట్టు క్వాలిఫైయర్స్ ఆడింది. కానీ అక్కడ ఘోరంగా విఫలమై, సూపర్ సిక్స్ దశలో 5వ స్థానంలో నిలిచి.. తమ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆ ప్రభావంతోనే 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా విండీస్ దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు 2027 టోర్నీ కోసం మారిన కొత్త రూల్స్ ప్రకారం.. 10 జట్లు పాల్గొనే క్వాలిఫైయర్స్‌లో విజేతగా నిలిచిన జట్టు మాత్రమే నేరుగా వరల్డ్ కప్ సెకండ్ రౌండ్‌కు వెళ్తుంది, మిగిలిన 2, 3, 4 స్థానాల్లోని జట్లు సూపర్ సిరీస్ ఆడాల్సి ఉంటుంది. మరి ఈసారైనా విండీస్ పాత తప్పులను దిద్దుకుని వరల్డ్ కప్‌కు వస్తుందో లేదో చూడాలి.

