కరోనావైరస్ సోకినప్పుడు అది కేవలం రోగనిరోధక శక్తితోనే పోరాడదని, శరీరంలో ఎప్పటి నుంచో నిగూఢంగా దాగున్న ఇతర ప్రమాదకరమైన పాత వైరస్‌లను సైతం తిరిగి నిద్రలేపుతుందని ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘నేచర్’ లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం.. కోవిడ్-19 వల్ల శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు, మనకు తెలియకుండానే దేహంలో దాక్కున్న పాత వైరస్‌లు మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
Also Read : బీసీలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..!
అమెరికాలోని 20 ఆసుపత్రులలో చేరిన 1,154 మంది కోవిడ్ రోగుల డేటాను పరిశీలించగా, దాదాపు 47.9 శాతం మందిలో కనీసం ఒక పాత వైరస్ అయినా తిరిగి యాక్టివ్ అయినట్లు ఆధారాలు లభించాయి. ఈ పరిశోధనలో మానవ శరీరంలో సుదీర్ఘకాలం నిద్రాణంగా ఉండే ఎప్‌స్టీన్-బార్ వైరస్, సైటోమెగాలోవైరస్, పెదవులపై పుండ్లు కలిగించే హెర్పెస్ సింప్లెక్స్ వైరస్-1తో పాటు ‘అనెల్లోవిరిడే’ కుటుంబానికి చెందిన వైరస్‌లు కోవిడ్ సోకిన రోగులలో మళ్లీ చురుగ్గా మారినట్లు కనుగొన్నారు.
Also Read : భారత ధనికులు విదేశాల్లోనే సెటిల్ అవుతారా..?
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తీవ్రమైన రోగనిరోధక లోపాలు లేని సాధారణ వ్యక్తులలో కూడా ఈ వైరస్‌లు తిరిగి మేల్కొనడం శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేసింది. కోవిడ్ సోకిన ప్రారంభ దశలోనే ఎప్‌స్టీన్-బార్ వైరస్ బయటపడగా, హెర్పెస్ మరియు సీఎంవీ వైరస్‌లు వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత ఆలస్యంగా యాక్టివ్ అవుతున్నట్లు పరిశోధకులు గమనించారు. శరీరంలో ఈ పాత వైరస్‌లు తిరిగి మేల్కొనడం వల్ల కోవిడ్ తీవ్రత మరింత పెరగడమే కాకుండా, చాలా కాలం పాటు పీడించే ‘లాంగ్ కోవిడ్’ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా ఇది దారితీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఈ వైరస్‌ల వల్లే కోవిడ్ తీవ్రంగా మారుతోందని ఖచ్చితంగా చెప్పలేమని, కానీ వీటి మధ్య బలమైన లింక్ ఉందనే విషయాన్ని మాత్రం కొట్టిపారేయలేమని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్త డాక్టర్ ఓఫర్ లెవీ స్పష్టం చేశారు.

