ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిరుద్యోగ నియామకాల అంశం తీవ్ర దుమారం రేపుతోంది. DSC నిర్వహణపై బురద చల్లి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న వైసీపీకి..గ్రూప్-1 నియామకాల స్కామ్ పెద్ద బూమరాంగ్‌లా మారింది. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ అక్రమాలపై ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్…హైకోర్టుకు సమర్పించిన రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. CCTVల తొలగింపు, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులతో వ్యాల్యుయేషన్, OMR స్లిప్పుల రీ-ప్రింటింగ్ లాంటి తీవ్ర ఉల్లంఘనలు జరిగినట్లు సిట్ విచారణలో స్పష్టమైంది. కేవలం అంకెల్లో తేడాలు మాత్రమే కాకుండా, కొంతమంది అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవస్థీకృత కుట్ర జరిగిందని ఫోరెన్సిక్ ఆధారాలు రుజువు చేస్తున్నాయి.
Also Read : ఈసారి చదువుకున్న వారికే పెద్ద పీట..!
ఈ భారీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో కేవలం అధికారుల పాత్రే కాకుండా, నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎలాంటి రాజకీయ అండదండలు, గ్రీన్ సిగ్నల్ లేకుండా పెద్ద స్థాయిలో నిబంధనలను తుంగలో తొక్కడం, OMR షీట్ల ప్రైవేటీకరణ లాంటి నిర్ణయాలు జరగడం అసాధ్యమనే చర్చ జరుగుతోంది. CID దర్యాప్తులో భాగంగా కొందరు IAS అధికారులను విచారించినప్పుడు, ఉన్నత స్థాయి ఒత్తిళ్ల వల్లే నిబంధనలు మార్చాల్సి వచ్చిందనే సమాధానాలు వచ్చాయి.
ప్రస్తుతం DSC అంశాన్ని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వంపై కుట్ర చేయాలని చూస్తున్న వైసీపీకి, ఈ గ్రూప్-1 కుంభకోణం దర్యాప్తు షాక్ ఇస్తోంది . అత్యంత పారదర్శకంగా పరిపాలన అందించామని చెప్పుకుంటున్న ఫ్యాన్ పార్టీ నేతల మాటలకు, సిట్ రిపోర్ట్‌కు పొంతన కుదరడం లేదు. నాటి ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమాలు ఇప్పుడు ప్రతిపక్షాన్ని డిఫెన్స్‌లోకి నెట్టేశాయి.
Also Read : ప్రశ్న రావణ్‌కు షాక్.. ఇక ఇప్పట్లో బయటకు రావడం కష్టమే..!
ఈ నివేదిక ఆధారంగా కోర్టు తీసుకోబోయే నిర్ణయాలు, సిట్ వేసే తుది ఛార్జ్‌షీట్ రాజకీయంగా కీలకం కానున్నాయి. కేవలం అడ్మినిస్ట్రేటివ్ అధికారులు మాత్రమే కాకుండా, నాటి విధాన నిర్ణేతలు, ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విచారణను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఉద్యోగాల పేరుతో యువత భవిష్యత్తుతో చెలగాటమాడిన జగన్ బ్యాచ్ బండారం ఈ సిట్ దర్యాప్తు ద్వారా పూర్తిగా బట్టబయలవుతోందని, తప్పు చేసిన అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టడం ఖాయం.

