Monday, October 12, 2026 09:27 AM
Monday, October 12, 2026 09:27 AM

జోగి రమేష్ రాజకీయ కెరీర్ క్లోజ్..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వివాదానికి సంబంధించిన సంచలన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. జోగి రమేష్ కోడలు మేఘన ఇప్పటికే మాజీ మంత్రి, ఆయన భార్య శకుంతల, కుమారుడు జోగి రాజీవ్‌లపై గృహహింస, వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఇవి కేవలం ఆరోపణలుగానే ప్రచారంలో ఉండగా, నిన్న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో జరిగిన అంతర్గత పంచాయితీ వీడియోలు పక్కా ఆధారాలతో బయటకు రావడంతో ఈ వ్యవహారం నడిరోడ్డుపైకి వచ్చింది.

Also Read : ప్రశ్న రావణ్‌కు షాక్.. ఇక ఇప్పట్లో బయటకు రావడం కష్టమే..!

వైరల్ అవుతున్న లీక్డ్ వీడియోలలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ తన తండ్రిపైనే బూతులతో ఊగిపోతూ, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. “నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఫోటో చూసినప్పుడే చెప్పినా వినకుండా, పది మందిని పిలిపించి నాకు బ్రెయిన్ వాష్ చేసి బలవంతంగా పెళ్లి చేశావు” అంటూ తండ్రి జోగి రమేష్‌పై రాజీవ్ సోఫాపై నిలబడి అరిచాడు. అంతేకాకుండా, తాను శారీరకంగా, లైంగికంగా అన్‌ఫిట్ అనే వ్యక్తిగత నిజాన్ని కూడా భర్త రాజీవ్ తన భార్య ముందు ఒప్పుకున్నట్లు ఈ వీడియోల ద్వారా బహిర్గతమైంది. మరోవైపు, అదనంగా రూ. 2 కోట్ల కట్నం తేవాలంటూ అత్త శకుంతల కోడలిని తీవ్రంగా వేధించిన ఆడియో క్లిప్పింగులు కూడా బయటకు రావడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Also Read : బీసీలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..!

సాధారణంగా పార్టీ నేతలపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా విపరీతంగా కౌంటర్లు ఇచ్చే వైసీపీ సోషల్ మీడియా వింగ్, ఈ వ్యవహారంలో మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయింది. పక్కా ఆధారాలు, ఆడియో-వీడియో లీకులతో ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారనే నిజాలు బయటపడటంతో డిఫెండ్ చేయడానికి ఎలాంటి అవకాశం లేక వైసీపీ క్యాడర్, లీడర్లు జోగి రమేష్‌కు కనీస మద్దతు కూడా ఇవ్వడం లేదు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి, ఆ తర్వాత నమోదైన రాజకీయ కేసులు ఒకెత్తయితే.. ఇప్పుడు సొంత కుటుంబం నుంచే లీకైన ఈ నైతిక సంక్షోభం జోగి రమేష్ రాజకీయ భవిష్యత్తును కోలుకోలేని దెబ్బ తీసిందని, ఆయన కెరీర్ దాదాపుగా క్లోజ్ అయినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీ కుట్రలకు చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం...

ఆధార్‌లో పేరు మార్చుకోవాలా?...

ఆధార్ కార్డులో పేరు సవరణ, మార్పులకు...

బ్రేకింగ్: రెండు రోజుల్లో...

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న...

బీసీ రిజర్వేషన్లపై ఏపీ...

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

తిరుమల నడక దారి...

తిరుమల కొండకు కాలిబాటన వచ్చే భక్తుల...

పోల్స్