భారత క్రికెట్ ప్రపంచంలో కేవలం 15 ఏళ్ల వయసులోనే తన సంచలన బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత కీలకమైన అడుగు వేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను ఈ యువ సంచలనం సొంతం చేసుకున్నాడు. అంతకుముందు అండర్-19 ప్రపంచకప్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన వైభవ్, అతి చిన్న వయసులోనే టీమిండియా సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి రికార్డు సృష్టించాడు.
Also Read : ఏపీలో త్వరలోనే క్యాబినెట్ ప్రక్షాళన..? ఆ ఐదుగురు మంత్రులపై వేటు పక్కా..?
అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ యువ బ్యాటర్.. ఇప్పుడు తన దృష్టిని సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్ట్ క్రికెట్ వైపు మళ్లించాడు. వైట్-బాల్ క్రికెట్‌లో తిరుగులేని రికార్డు ఉన్నప్పటికీ, కదిలే రెడ్ బాల్ ను ఎదుర్కోవడంలో వైభవ్.. సాంకేతికతపై రక్షణ నిపుణుల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో వైభవ్ 17.25 సగటుతో కేవలం 207 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ గణాంకాలను మార్చాలని గట్టిగా డిసైడ్ అయిన వైభవ్, ప్రస్తుతం నాగ్‌పూర్‌లోని రాజస్థాన్ రాయల్స్ పర్ఫార్మెన్స్ సెంటర్‌లో జరుగుతున్న 10 రోజుల ప్రత్యేక రెడ్-బాల్ క్యాంప్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
Also Read : లోకేష్ మార్క్ డార్క్ యాక్షన్.. బన్నీకి విలన్ గా బాలీవుడ్ స్టార్..?
పవర్ హిట్టింగ్‌కు కాకుండా, టెస్ట్ క్రికెట్‌కు అవసరమైన సహనం, ఖచ్చితమైన షాట్ సెలెక్షన్ మరియు సుదీర్ఘ సమయం క్రీజులో నిలదొక్కుకునే వ్యూహాలపై ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. త్వరలోనే ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వైభవ్‌ను ఎంపిక చేయడం విశేషం. ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈ జట్టులో వైభవ్ కీలక బాధ్యతలు చేపట్టబోతున్నాడు. జింబాబ్వేతో జరిగిన గత మ్యాచ్‌లో వైభవ్ తన సహజ సిద్ధమైన అగ్రెసివ్ శైలిని పక్కనబెట్టి, వికెట్ కాపాడుకుంటూ 49 బంతుల్లో 83 పరుగులు చేసి తనలోని క్లాస్ గేమ్‌ను ప్రపంచానికి చూపించాడు. వయసు చాలా చిన్నది కావడంతో, తన ఆటను టెస్ట్ ఫార్మాట్‌కు తగ్గట్టుగా మలచుకోవడానికి వైభవ్‌కు అద్భుతమైన అవకాశం ఉంది. మరి ఈ టీ20 కింగ్ రాబోయే రోజుల్లో టీమిండియా టెస్ట్ జట్టులోనూ తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడో లేదో వేచి చూడాలి.

