Sunday, September 20, 2026 06:33 AM
Sunday, September 20, 2026 06:33 AM

ఈరోజు రాశి ఫలితాలు (20-09-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్ల పక్షం.. 20-09-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. దూరప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
—————————————

వృషభం

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూర ప్రయాణాల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.
—————————————

మిధునం

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.
—————————————

కర్కాటకం

విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
—————————————

సింహం

కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.
—————————————

కన్య

గృహమున చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.
—————————————

తుల

విద్యార్థుల ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరటనిస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది.
—————————————

వృశ్చికం

ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు.
—————————————

ధనస్సు

వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
—————————————

మకరం

సన్నిహితులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. నూతన భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
—————————————

కుంభం

కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.
—————————————

మీనం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు చికాకు పరుస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్