Saturday, August 8, 2026 12:11 PM
Saturday, August 8, 2026 12:11 PM

ఏపీలో త్వరలోనే క్యాబినెట్‌ ప్రక్షాళన..? ఆ ఐదుగురు మంత్రులపై వేటు పక్కా..?

ఏపీ రాజకీయాల్లో మరోసారి కేబినేట్ ప్రక్షాళన ఆసక్తిని రేపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు త్వరలోనే తొలిసారిగా తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచని మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి, వారి స్థానంలో యాక్టివ్ గా ఉండే సీనియర్లకు అవకాశం కల్పించాలని చంద్రబాబు గట్టి ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేబినెట్ ప్రక్షాళన వార్త ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో గుబులు రేపుతోంది.

Also Read : పార్టీ ఆఫీస్ లో చంద్రబాబు కీలక భేటీ..!

అసలు వేటు పడబోయే ఆ ఐదుగురు మంత్రులు ఎవరు..? అనే లిస్ట్ కూడా ఇప్పుడు లీక్ అయింది. కొలుసు పార్థసారథి, ఎస్. సవిత, ఎన్.ఎమ్.డి. ఫరూఖ్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మరియు వాసంశెట్టి సుభాష్‌లపై చంద్రబాబు వేటు వేసే ఛాన్స్ ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. శాఖల కేటాయింపు తర్వాత ప్రతిపక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మరియు పరిపాలనాపరంగా ఫైల్స్ క్లియరెన్స్‌ వేగవంతం చేయడంలో ఈ ఐదుగురు నేతలు తీవ్రంగా వెనుకబడ్డారని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం.

Also Read : జనసేన జెండా కోసం పవన్ మాస్టర్ ప్లాన్..!

వీరి పనితీరుపై చంద్రబాబుకు అందిన ఇంటెలిజెన్స్ మరియు ఐవీఆర్ఎస్ సర్వే రిపోర్టులు కూడా ఆశాజనకంగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ కేబినెట్ సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు ఉండబోతోంది అంటే.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ప్రక్షాళనకు చంద్రబాబు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఎన్నికల వేళ పార్టీ క్యాడర్ లో అసంతృప్తి రాకుండా జాగ్రత్త పడుతూనే, ఎన్నికలు ముగియగానే సమర్థులకు పగ్గాలు అప్పగించాలని బాబు డిసైడ్ అయ్యారు. ప్రతిపక్షాన్ని అసెంబ్లీ లోపల, బయట గట్టిగా తొక్కేయగల వాయిస్ ఉన్న సీనియర్లను మరియు స్పీడ్ గా ఫైల్స్ క్లియర్ చేయగల సమర్థులను ఈ ఐదుగురి స్థానంలోకి తీసుకురాబోతున్నట్లు టాక్. మరి ఈ ప్రక్షాళన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఎలాంటి సమీకరణాలు మారతాయో వేచి చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్టీ ఆఫీస్ లో...

స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలు...

పోలీసులను టార్గెట్ చేసిన...

గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన...

జనసేన జెండా కోసం...

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయంగా...

కవితను లైట్ తీసుకున్న...

తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ...

ఈవీఎంలకు వ్యతిరేకంగా కాక్రోచ్...

ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నీట్...

బెజవాడ మేయర్ పీఠంపై...

ఇటీవల కాపు నేత ముద్రగడ పద్మనాభం...

పోల్స్