Tuesday, August 18, 2026 03:17 PM
Tuesday, August 18, 2026 03:17 PM

ప్రశ్న రావణ్‌కు షాక్.. ఇక ఇప్పట్లో బయటకు రావడం కష్టమే..!

యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత గట్టిగా బిగుస్తోంది. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే ఆరోపణలతో గన్నవరం పోలీసులు ఆయనపై ఉపా కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు, హైకోర్టు ఆదేశాల మేరకు దీనిని విజయవాడలోని ఎన్‌ఐఏ కేసులు విచారించే ప్రత్యేక కోర్టుకు అధికారికంగా బదిలీ చేశారు. ఇప్పటివరకు గన్నవరం కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసు ఫైళ్లు మరియు రికార్డులు ఇప్పుడు విజయవాడలోని రెండవ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టుకు చేరుకున్నాయి.

Also Read : బీసీలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..!

ఈ కేసు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టుకు బదిలీ కావడంతో ప్రశ్న రావణ్‌కు చట్టపరంగా అన్ని దారులు మూసుకుపోయినట్లయింది. సాధారణంగా ఉపా చట్టం కింద నమోదైన కేసులలో నిందితులకు రెగ్యులర్ బెయిల్ లభించడం అత్యంత కఠినమైన ప్రక్రియ. నిందితుడికి వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు భావిస్తే, బెయిల్ ఇచ్చేందుకు చట్టం అంగీకరించదు. గతంలో నమోదైన ఇతర సాధారణ రాజకీయ కేసుల్లో బెయిల్ వచ్చినా, దేశ భద్రతతో ముడిపడి ఉన్న ఈ ప్రత్యేక కేసులో మాత్రం ఎన్‌ఐఏ కోర్టు నుండి ఉపశమనం లభించడం దాదాపు అసాధ్యమని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Also Read : నాగబాబు.. ఇక నుంచి క్యాబినెట్ స్థాయి హోదా..!

మరోవైపు, ప్రశ్న రావణ్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇదివరకే వాదనలు ముగిసినప్పటికీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కేసు కోర్టు మారినందున, ఈ కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులోనే మళ్లీ మొదటి నుండి ఇరుపక్షాల లాయర్లు వాదనలు వినిపించాల్సి ఉంటుంది. గతంలో పటమట, పెనమలూరు పోలీస్ స్టేషన్లలో నమోదైన మావోయిస్టుల కేసుల తరహాలోనే ఈ కేసును కూడా ప్రత్యేక కోర్టు పరిధిలోకి తీసుకురావడంతో, ప్రశ్న రావణ్ చుట్టూ లీగల్ లూప్‌హోల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయని, ఆయన ఇప్పట్లో జైలు నుండి బయటకు వచ్చే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జోగి రమేష్ రాజకీయ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

బీసీలకు చంద్రబాబు సర్కార్...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన...

నాగబాబు.. ఇక నుంచి...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

అసెంబ్లీలో లోకేష్, సత్యకుమార్...

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్రమైన రాజకీయ చర్చల...

ఇంటింటికి తెలుగుదేశం క్రేజీ...

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

భోగాపురంలో ల్యాండ్ అయిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ...

పోల్స్