Monday, August 10, 2026 05:54 PM
Monday, August 10, 2026 05:54 PM

టీమిండియాలోకి సర్ఫరాజ్ ఖాన్ రీఎంట్రీ..?

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. యువ బ్యాటర్ బి. సాయి సుదర్శన్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరం కావడంతో, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకుంది. గత 2024 లో భారత జట్టు తరఫున చివరి టెస్ట్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్, ఆ తర్వాత పదేపదే సెలెక్టర్ల నిర్లక్ష్యానికి గురయ్యాడు. ఇప్పుడు మళ్లీ ఆయనకు పిలుపు రావడంతో జట్టులో పోటీ పెరిగింది.

Also Read : స్థానిక పోరు.. రణమా.. రణరంగమా..?

అయితే, సర్ఫరాజ్ పునరాగమనం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరియు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక విషయంలో సరికొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. సాయి సుదర్శన్ దూరం కావడంతో జట్టులో ఖాళీ అయిన నంబర్ 3 స్థానం కోసం గంభీర్ ఎవరిని ఎంపిక చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. సర్ఫరాజ్ ఖాన్ సాధారణంగా నంబర్ 4 లేదా నంబర్ 5 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తుంటారు. కాబట్టి నంబర్ 3 స్థానంలో ఆయనను ఆడించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. శ్రీలంక క్రికెట్ ఎలెవన్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో రాణించిన దేవదత్ పడిక్కల్‌ను నంబర్ 3 లో ఆడించేందుకే గౌతమ్ గంభీర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఎల్ నినో కరవుపై పట్టిసీమ విజయం..!

లేదా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్వయంగా వన్‌డౌన్‌లో వచ్చి, పడిక్కల్‌ను మిడిల్ ఆర్డర్‌కు మార్చే వ్యూహాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనివల్ల సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టులో బెంచ్‌కే పరిమితం కావలసి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గాయాల కారణంగా కొందరు సీనియర్ ప్లేయర్లు అందుబాటులో లేకపోవడంతో, గాలే వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా సరికొత్త కాంబినేషన్‌తో బరిలోకి దిగనుంది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. వన్‌డౌన్‌లో దేవదత్ పడిక్కల్, నాలుగో స్థానంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు రానున్నారు. వికెట్ కీపర్ బాధ్యతలను రిషబ్ పంత్ చూసుకోనుండగా, ఆల్ రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, సరాంశ్ జైన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ ప్రధాన పాత్ర పోషించనుండగా, పేస్ దళాన్ని మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ నడిపించనున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మెట్రో రైల్ కూతకు...

ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు...

దామచర్లపై బాలినేని మరోసారి...

ఒంగోలు రాజకీయం మరోసారి తీవ్ర రసవత్తరంగా...

విమర్శలకు చెక్ పెట్టడంలో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీలో అవతల జరిగాయని...

ఏపి పోలీసుల పై...

ఏపీ పారిశ్రామికా శాఖ మంత్రి టి.జి....

స్థానిక పోరు.. రణమా.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

ఒంగోలు పాలిటిక్స్‌లో కూటమి...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమికి చెందిన ఇద్దరు...

పోల్స్