Tuesday, August 18, 2026 07:11 PM
Tuesday, August 18, 2026 07:11 PM

గ్రీన్ వాహనదారులకు కేంద్రం బంపర్ ఆఫర్..!

భారతదేశంలో పర్యావరణ హిత వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. సాధారణ పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే.. ఎలక్ట్రిక్, హైడ్రోజన్, మరియు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఇంధనాలతో నడిచే వాహనాల కార్యాచరణ కాలపరిమితిని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని కేంద్రం ప్రతిపాదించింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989 సవరణల ముసాయిదా నోటిఫికేషన్‌లో భాగంగా ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది.

Also Read : జోగి రమేష్ రాజకీయ కెరీర్ క్లోజ్..?

ఈ నిర్ణయం అమలులోకి వస్తే వాణిజ్య రవాణాదారులు, ఫ్లీట్ ఆపరేటర్లతో పాటు సాధారణ వాహనదారులకు కూడా భారీగా ఆర్థిక ఉపశమనం లభించనుంది. ఈ కాలపరిమితి పొడిగింపు ప్రతిపాదనతో పాటు రవాణా రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసేందుకు కేంద్రం మరికొన్ని కీలక మార్పులను ప్రతిపాదించింది. వివిధ రాష్ట్రాల మధ్య నడిచే వాణిజ్య వాహనాలకు అవసరమయ్యే ‘నేషనల్ పర్మిట్’ విధానాన్ని ఇకపై వంద శాతం ఆన్‌లైన్ చేయనున్నారు. దీనివల్ల దరఖాస్తులు, అనుమతుల ప్రక్రియ సులువవడమే కాకుండా పత్రాల గొడవ, కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయి.

Also Read : భారత ధనికులు విదేశాల్లోనే సెటిల్ అవుతారా..?

అలాగే ఆటోమొబైల్ విడిభాగాల తయారీదారులను కూడా ‘ట్రేడ్ సర్టిఫికేట్’ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల విడిభాగాల టెస్టింగ్, రవాణా ప్రక్రియ మరింత సరళతరం కానుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా ప్రతిపాదనలు ప్రస్తుతం ముసాయిదా దశలోనే ఉన్నాయని, త్వరలోనే వివిధ భాగస్వామ్య పక్షాలు, పరిశ్రమల వర్గాల నుండి ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత దీనిపై తుది నిర్ణయం వెలువడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాలుష్య రహిత వాహనాల కొనుగోలుపై ఇస్తున్న సబ్సిడీలతో పాటు.. ఇప్పుడు కాలపరిమితిని కూడా ఐదేళ్లు పెంచడం వల్ల ఈవీ, సీఎన్‌జీ వాహనాల నిర్వహణ ఖర్చు తగ్గి, వాటి అమ్మకాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

APPSC గ్రూప్-1 అక్రమాలు.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిరుద్యోగ నియామకాల అంశం...

జోగి రమేష్ రాజకీయ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

ప్రశ్న రావణ్‌కు షాక్.....

యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ చట్టపరమైన...

బీసీలకు చంద్రబాబు సర్కార్...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన...

నాగబాబు.. ఇక నుంచి...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

అసెంబ్లీలో లోకేష్, సత్యకుమార్...

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్రమైన రాజకీయ చర్చల...

పోల్స్