Monday, October 12, 2026 12:54 AM
Monday, October 12, 2026 12:54 AM

ఆగస్టు 24 నుండి కొత్త సిమ్ రూల్స్.. ఆ లిమిట్ దాటితే మీ నంబర్లు బ్లాక్..!

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, ఆగస్టు 24వ తేదీ నుండి దేశవ్యాప్తంగా కొత్త సిమ్ కార్డ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. ఒకే ఐడీ కార్డుపై అనుమతించబడిన పరిమితి కంటే ఎక్కువ కనెక్షన్లు కలిగి ఉన్న వినియోగదారుల అదనపు సిమ్‌లను బ్లాక్ చేయడమే ఈ సరికొత్త సర్క్యులర్ ముఖ్య ఉద్దేశం.

Also Read : క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్..!

ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేశంలో ఒక వ్యక్తి పేరు మీద గరిష్టంగా 9 సిమ్ కార్డ్‌లు మాత్రమే ఉండాలి. అయితే జమ్మూ కాశ్మీర్, అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు మాత్రం ఈ గరిష్ట పరిమితి 6 సిమ్‌లుగా నిర్ణయించబడింది. ఇకపై కొత్త సిమ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ పాత నంబర్ల వివరాలన్నీ ఫామ్‌లో డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే గరిష్ట లిమిట్ దాటి ఉంటే, టెలికాం కంపెనీలు కొత్త సిమ్ ఇవ్వడాన్ని పూర్తిగా తిరస్కరిస్తాయి.

Also Read : కొండా సురేఖ పై వేటు..? రేవంత్ సీరియస్ మీటింగ్..!

అదనపు సిమ్‌లను సులభంగా కనిపెట్టేందుకు టెలికాం ఆపరేటర్లు ఇకపై ప్రభుత్వ ‘డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్’ రికార్డులను క్రాస్-చెక్ చేయనున్నారు. ఆగస్టు 23 నుండి దీనికి ఫోటో ఆధారిత గుర్తింపు ఫీచర్‌ను కూడా జోడిస్తుండటంతో అక్రమ సిమ్‌ల గుర్తింపు మరింత సులువవుతుంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి అదనపు కనెక్షన్లు యాక్టివేట్ చేసినట్లు తెలిస్తే.. ఆ నంబర్లను వెంటనే ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఆధార్‌లో పేరు మార్చుకోవాలా?...

ఆధార్ కార్డులో పేరు సవరణ, మార్పులకు...

బ్రేకింగ్: రెండు రోజుల్లో...

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న...

బీసీ రిజర్వేషన్లపై ఏపీ...

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

తిరుమల నడక దారి...

తిరుమల కొండకు కాలిబాటన వచ్చే భక్తుల...

సచివాలయ ఉద్యోగుల గుండెల్లో...

ఇటీవల విజయవాడలో ఆందోళన నిర్వహించిన గ్రామ,...

పోల్స్