Sunday, October 11, 2026 10:19 PM
Sunday, October 11, 2026 10:19 PM

కొండా సురేఖ పై వేటు..? రేవంత్ సీరియస్ మీటింగ్..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా కుటుంబం ఎపిసోడ్ తీవ్ర కలకలం రేపుతోంది. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు పలువురు మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను కాంగ్రెస్ అధిష్ఠానం సైతం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. అయితే, ఈ వివాదంపై మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ.. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇప్పటికే పార్టీకి వివరణ ఇచ్చుకున్నారు.

Also Read : మాట జాగ్రత్త.. పార్టీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..!

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో అత్యవసరంగా చర్చలు జరిపారు. కొండా సుస్మిత వ్యాఖ్యల పర్యవసానాలపై నేడు 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఎమ్మెల్యేలంతా కలిసి సీఎల్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. పార్టీ లైన్ దాటి వ్యవహరించినందుకు గానూ కొండా సురేఖను వెంటనే మంత్రి వర్గం నుంచి తొలగించాలని, అలాగే ఆమెను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్ చేయనున్నట్లు సమాచారం.

Also Read : హర్మూజ్.. పట్టు కోల్పోయిన ఇరాన్..!

మరోవైపు, ఈ కీలక సమావేశంలో కేవలం కొండా కుటుంబం వ్యవహారమే కాకుండా.. పార్టీలో హాట్ టాపిక్‌గా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వైఖరిపై కూడా ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా చర్చించనున్నారు. కొద్దిరోజులుగా పార్టీ అంతర్గత విషయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఈ ఎమ్మెల్యేల భేటీ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అధిష్ఠానం మరియు ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఆధార్‌లో పేరు మార్చుకోవాలా?...

ఆధార్ కార్డులో పేరు సవరణ, మార్పులకు...

బ్రేకింగ్: రెండు రోజుల్లో...

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న...

బీసీ రిజర్వేషన్లపై ఏపీ...

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

తిరుమల నడక దారి...

తిరుమల కొండకు కాలిబాటన వచ్చే భక్తుల...

సచివాలయ ఉద్యోగుల గుండెల్లో...

ఇటీవల విజయవాడలో ఆందోళన నిర్వహించిన గ్రామ,...

పోల్స్