Friday, August 21, 2026 12:38 PM
Friday, August 21, 2026 12:38 PM

ఈడీ సోదాలు.. వైసీపీ కొత్త నాటకం..!

వైసీపీ నేతలు ఏ అంశం అయినా సరే తమకు అనుకూలంగా మలుచుకోగల సమర్థులు. ఇంకా చెప్పాలంటే కింద పడినా సరే.. తమదే పై చెయ్యి అని ఎదురు దాడి చేయటంలో వైసీపీ నేతలు మరెవరు సాటి రారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలో ఉన్నప్పుడు మరో మాట.. ఘోర పరాజయం తర్వాత గాలి మాట.. ఇదే వైసీపీ నేతల తీరు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్నాడంటే.. ఆ ఊర్లల్లో ప్రజలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. ఎందుకంటే.. రెండు రోజుల ముందే సెలవు ప్రకటిస్తారు. అలాగే రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను తొలగిస్తారు. అంతా చేసి పరాదాల మధ్య ప్రయాణం. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సమయంలో ఫుట్ పాత్ మీద ఆక్రమించుకున్న దుకాణాలను తొలగిస్తే మాత్రం.. చిరు వ్యాపారులపై కొరడా అంటూ పేద పలుగులు పలకడంలో వైసీపీ నేతలకు, ఆ పార్టీ అనుకూల మీడియాకు సాటి మరోటి లేదు.

Also Read : కొండా సురేఖ పై వేటు..? రేవంత్ సీరియస్ మీటింగ్..!

తాజాగా మరో విషయంలో కూడా వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ పైన ఎదురు దాడి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. అసలు తమకు ఎలాంటి సంబంధం లేని విషయాన్ని కూడా మకిలి పులిమేందుకు వైసీపీ నేతలు తెగ ఆరాటపడుతున్నారు. 2019 ఫిబ్రవరి నెలలో మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. దీనిపై వైసీపీ నేతలు మొదటి నుంచి మాట మారుస్తూనే ఉన్నారు. ముందు గుండెపోటు అన్నారు.. తర్వాత బాత్ రూమ్‌లో జారి పడ్డారన్నారు.. చివరికి గొడ్డలి పోటు అని ఖాయమైంది. ఆ తర్వాత నుంచి కొత్త డ్రామాకు తెర లేపారు. ఈ హత్య చంద్రబాబు చేయించారని ఆరోపిస్తూ.. నారాసుర రక్త చరిత్ర అంటూ బ్యానర్ వార్త రాయటమే కాకుండా.. చంద్రబాబు చేతిలో రక్తంతో ఉన్న కత్తి పెట్టారు. ఆ సానుభూతితోనే ఎన్నికల్లో గెలిచారు కూడా.

Also Read : కూటమిలో అంతర్గతంగా అసహనం.. నిజమేనా..?

అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. అసలు హంతకులు ఎవరో ఇప్పటికే తెలుగు ప్రజలందరికీ తెలుసు. నిందితులను కాపాడేందుకు ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ఎన్ని ప్రయత్నాలు చేశారో కూడా తెలుసు. చివరికి వివేకా కుమార్తె సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో.. ఆమె, ఆమె భర్త కలిసి హత్య చేయించినట్లు నాటి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆరోపించారు.

తాజాగా వివేకా హత్య కేసులో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ రంగ ప్రవేశం చేసింది. వివేకా హత్య కేసు కోసం 5 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినట్లు ఇప్పటికే ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్ వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఆ డబ్బు ఎక్కడిది.. ఎరవిచ్చారు.. ఎవరికిచ్చారు.. ఎంత ఇచ్చారు అనే కోణంలో సీబీఐ విజ్ఞప్తి మేరకు ఈడీ రంగంలోకి దిగింది. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏపీ, తెలంగాణలో ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్, కడపలో మొత్తం 6చోట్ల శుక్రవారం ఉదయం నుంచి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. కడపలోని ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, దస్తగిరి ఇల్లు సహా మూడు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

Also Read : మాట జాగ్రత్త.. పార్టీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..!

అయితే దీనిపై వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కునే దమ్ము లేక ఇలా బెదిరిస్తున్నారని వింత ఆరోపణలు చేస్తున్నారు. డీఎస్సీలో అక్రమాలు, అవినీతి అంటూ జగన్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక.. ఇలా ఈడీ సోదాల పేరుతో టాపిక్ డైవర్ట్ చేస్తున్నారంటున్నారు. అయితే ఇక్కడే వైసీపీ నేతల అజ్ఞానం బయటపడుతోంది. ఈడీ అనేది పూర్తిగా కేంద్రం పరిధిలో పని చేసే సంస్థ. వివేకా హత్య విచారణ చాలా రోజుల క్రితమే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పరిధిలోకి వెళ్లిపోయింది. ఇక డీఎస్సీ స్కామ్ అనే ఆరోపణలకు మంత్రి నారా లోకేష్ ఇప్పటికే జవాబిచ్చారు. జగన్ వస్తే.. డిబేట్‌కు రెడీ అని సవాల్ కూడా చేశారు. ఆ సవాల్‌కు స్పందించని వైసీపీ నేతలు.. ఈడీ సోదాలను తెలుగుదేశం పార్టీకి ఆపాదించేందుకు నానా పాట్లు పడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కొండా సురేఖ పై...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా కుటుంబం...

మాట జాగ్రత్త.. పార్టీ...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు...

కూటమిలో అంతర్గతంగా అసహనం.....

కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షాల మధ్య విభేదాలు...

హైదరాబాద్ టార్గెట్‌గా పాక్...

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో...

గ్రూప్-1 అక్రమాలు.. వైసీపీ...

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత లోపిస్తే...

పరిశ్రమల్లో పచ్చని విప్లవం.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు...

పోల్స్