Thursday, August 20, 2026 03:31 PM
Thursday, August 20, 2026 03:31 PM

హర్మూజ్.. పట్టు కోల్పోయిన ఇరాన్..!

హర్మూజ్ జలసంధి.. పశ్చిమాసియా యుద్ధానికి ఇప్పుడు మరింత ఆజ్యం పోస్తున్న అంశం. ఈ జలమార్గంపై నియంత్రణ తమకే ఉందంటూ ఇరాన్, అమెరికా కొన్ని రోజులుగా వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నాయి. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ఒక అడుగు ముందుకేసి.. ‘హర్మూజ్ ఇక మా భూభాగమే’ అని ప్రకటించుకున్నారు. దీన్ని ఇరాన్ ఖండిస్తున్నప్పటికీ.. తాజాపరిణామాలు చూస్తుంటే ఈ కీలక జలసంధి టెహ్రాన్ చేయి దాటిపోతున్నట్లే కన్పిస్తోంది. హర్మూజ్‌పై ఇరాన్ 80 శాతం పట్టు కోల్పోయినట్లేనని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. హర్మూజ్ జలసంధిలో ఇప్పుడు రెండు మార్గాల్లో నౌకల రాకపోకలు సాగుతున్నాయి. ఒకటి ఇరాన్ సూచించిన మార్గం కాగా.. రెండోది ఒమన్ ఉత్తర తీరం మీదుగా వెళ్లే షిప్పింగ్ ఛానెల్. ఇది అమెరికా సూచించిన ఐరాస అధీకృత రవాణా మార్గం.

Also Read : గల్ఫ్ దేశాల్లో హై అలెర్ట్.. స్పీడ్ పెంచిన ఇరాన్..!

అయితే, హర్మూజ్ తమ నియంత్రణలోనే ఉందని చెబుతున్నే ఇరాన్.. ఒమన్ రూట్లో వెళుతున్న నౌకలపై పదే పదే దాడులు చేస్తోంది. అయినప్పటికీ.. చాలా నౌకలు ఇదే మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. గత రెండు వారాలుగా ఒమన్ మార్గంలోనే 80 శాతానికి పైగా నౌకలు హర్మూజ్‌ దాటినట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లెర్ డేటా చెబుతోంది. ఇరాన్ దాడులు కొనసాగుతున్నప్పటికీ.. అమెరికా నౌకాదళాలు కల్పిస్తున్న భద్రతతో ఈ నౌకలు ఒమన్ తీరం నుంచి ప్రయాణిస్తున్నాయని డేటా పేర్కొంది. దీన్ని బట్టి చూస్తుంటే హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కోల్పోతున్నట్లు స్పష్టమవుతోందని కెప్లెర్ క్రూడాయిల్ అనాలిసిస్ హెడ్ అభిప్రాయపడ్డారు.

నెల క్రితం వరకు ఒమన్ మార్గంలో ఎలాంటి నౌకల ట్రాఫిక్‌ను కెప్లెర్ గుర్తించలేదు. కానీ, రెండు వారాల నుంచి ఈ రూట్లో రాకపోకలు గణనీయంగా పెరుగుతుండటం గమనార్హం. కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ దేశాలు హర్మూజ్ మీదుగా పర్షియన్ గల్ఫ్‌ను దాటడానికి అతిపెద్ద క్రూడాయిల్ ట్యాంకర్లను వినియోగిస్తున్నాయి. తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని డేంజర్ జోన్ వెలుపలకు చేరుకున్న తర్వాత.. కస్టమర్ ట్యాంకర్లలో చమురు నింపుతున్నాయి. అయితే, హర్మూజ్ దాటే క్రమంలో ఇరాన్ దాడుల నుంచి తప్పించుకునేందుకు కొన్ని వారాల పాటు ఇవి తమ ట్రాన్స్‌పాండర్లను ఆఫ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also Read : భారత్ ఘన విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక పరిస్థితి ఏంటీ..?

ఈ జలసంధి నుంచి ప్రయాణిస్తున్న అన్ని నౌకలపై అమెరికా నిఘా పెట్టింది. తాము సూచించిన మార్గంలో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పిస్తున్నామని, తద్వారా చమురు రవాణా నిరాటంకంగా సాగేందుకు కృషి చేస్తున్నామని అగ్రరాజ్యం చెబుతోంది. హర్మూజ్ మీదుగా గతవారం రోజుకు సగటున 15 మిలియన్ బ్యారెల్స్ చమురు రవాణా జరిగినట్లు అమెరికా ఇంధన మంత్రి ప్రకటించారు. యుద్ధం ముందు నాటి పరిస్థితికి చేరుకుంటున్నామని తెలిపారు. అందువల్లే ‘హర్మూజ్ మా భూభాగమే’ అని ట్రంప్ ప్రకటించుకున్నారు.

వాస్తవానికి అమెరికాతో చర్చిస్తున్న అవగాహన ఒప్పందం ప్రకారం.. హర్మూజ్‌లో ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేసేందుకు ఇరాన్‌కు అవకాశం లభించనుంది. దీన్ని గల్ఫ్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా సూచించిన ఒమన్ మార్గాన్ని నౌకలు ఎంచుకోవడానికి ఈ టోల్ కూడా ఓ కారణమనే చెప్పొచ్చు. ఇప్పుడు హర్మూజ్‌ పై ఆధిపత్యం తగ్గితే టెహ్రాన్‌కు ఆర్థికంగా కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. మరోవైపు, ఈ జలసంధిపై పట్టు పెంచుకునేందుకు ఇరాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నౌకల రాకపోకల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికపై ఒమన్ ఒప్పందం కుదిరిందని టెహ్రాన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, హర్మూజ్ విషయంలో జోక్యం చేసుకుంటే.. ఒమన్‌పై బాంబులేస్తామని అమెరికా బెదిరించడంతో ఈ ఒప్పందం అమలుపై సందిగ్ధత నెలకొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

హైదరాబాద్ టార్గెట్‌గా పాక్...

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో...

గ్రూప్-1 అక్రమాలు.. వైసీపీ...

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత లోపిస్తే...

పరిశ్రమల్లో పచ్చని విప్లవం.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు...

భారత్ ఘన విజయం.....

గాలే అంతర్జాతీయ మైదానంలో శ్రీలంకతో జరిగిన...

టాలీవుడ్ కు షాక్...

తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల టికెట్...

సాయిరెడ్డి పార్టీ.. వైసీపీలో...

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ...

పోల్స్