Thursday, August 20, 2026 03:45 PM
Thursday, August 20, 2026 03:45 PM

అమెరికా షాకింగ్ కామెంట్స్.. పాక్ కు భారత్ షాక్..!

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల ఉన్న ట్రాఫిక్ బొల్లార్డ్స్, సెక్యూరిటీ బారికేడ్లు మరియు ఇతర రక్షణ నిర్మాణాలను భారత అధికారులు జేసీబీలతో పూర్తిగా తొలగించారు. ఈ వారంలోనే ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ వెలుపల ఉన్న రక్షణ బారికేడ్లను పాకిస్థాన్ తొలగించినందుకు ప్రతిచర్యగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దౌత్య కార్యాలయం వెలుపల ఉన్న అనధికారిక ఆక్రమణలను క్లియర్ చేయడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

Also Read : గ్రూప్-1 అక్రమాలు.. వైసీపీ పాలనలో నిరుద్యోగుల కన్నీరు!

ప్రస్తుత అమెరికా ప్రభుత్వంలో దక్షిణాసియా ప్రత్యేక రాయబారిగా ఉన్న సెర్గియో గోర్ ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో శికారా రైడ్ చేసిన ఆయన, జమ్మూ కాశ్మీర్‌ను “భారత్ లో అత్యంత కీలకమైన భాగం” అని కొనియాడారు. అంతేకాకుండా, స్థానిక ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న భద్రతా చర్యలను ప్రశంసిస్తూ, కాశ్మీర్ పర్యటనపై అమెరికా తన పౌరులకు జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీలను పునఃసమీక్షిస్తామని హామీ ఇచ్చారు.

Also Read : పరిశ్రమల్లో పచ్చని విప్లవం.. పవన్ ఆదేశాలతో 43 వేలకు పైగా మొక్కలు..!

అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలపై ఇస్లామాబాద్ తీవ్రంగా స్పందించింది. కాశ్మీర్ అంతర్జాతీయంగా గుర్తించబడిన వివాదాస్పద ప్రాంతమని, దీనిని భారత్‌లో అంతర్భాగంగా అభివర్ణించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఇస్లామాబాద్‌లోని యూఎస్ తాత్కాలిక రాయబారి నథాలీ బేకర్‌కు పాకిస్థాన్ సమన్లు జారీ చేసి గట్టి నిరసన వ్యక్తం చేసింది. అమెరికా రాయబారి వ్యాఖ్యలు ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని పాక్ ఆరోపించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

హైదరాబాద్ టార్గెట్‌గా పాక్...

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో...

గ్రూప్-1 అక్రమాలు.. వైసీపీ...

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత లోపిస్తే...

పరిశ్రమల్లో పచ్చని విప్లవం.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు...

భారత్ ఘన విజయం.....

గాలే అంతర్జాతీయ మైదానంలో శ్రీలంకతో జరిగిన...

టాలీవుడ్ కు షాక్...

తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల టికెట్...

సాయిరెడ్డి పార్టీ.. వైసీపీలో...

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ...

పోల్స్