Wednesday, August 19, 2026 06:32 AM
Wednesday, August 19, 2026 06:32 AM

ఈరోజు రాశి ఫలితాలు (19-08-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణ మాసం, శుక్ల పక్షం.. 19-08-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

కీలక వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటాబయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

—————————————

వృషభం

కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

—————————————

మిధునం

ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

—————————————

కర్కాటకం

ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.

—————————————

సింహం

సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

—————————————

కన్య

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. శ్రమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

—————————————

తుల

గృహమునకు చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

—————————————

వృశ్చికం

కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక పరంగా ఒత్తిడులు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

—————————————

ధనస్సు

కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. స్ధిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి.

—————————————

మకరం

సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.

—————————————

కుంభం

చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలిక ఋణాల నుండి బయటపడగలుగుతారు.

—————————————

మీనం

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

APPSC గ్రూప్-1 అక్రమాలు.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిరుద్యోగ నియామకాల అంశం...

జోగి రమేష్ రాజకీయ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

ప్రశ్న రావణ్‌కు షాక్.....

యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ చట్టపరమైన...

బీసీలకు చంద్రబాబు సర్కార్...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన...

నాగబాబు.. ఇక నుంచి...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

అసెంబ్లీలో లోకేష్, సత్యకుమార్...

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్రమైన రాజకీయ చర్చల...

పోల్స్