Saturday, August 22, 2026 07:25 PM
Saturday, August 22, 2026 07:25 PM

ఆ పల్లెలు కన్నీరు పెడుతున్నాయి.. కానీ..!

ఒక మహా కార్యం జరగాలంటే.. ఎంతో మంది త్యాగం ఉండాల్సిందే. దేశానికి స్వాతంత్ర్యం రావడం వెనుక ఎంతో మంది మహానుభావుల పోరాటం, వేల మంది ప్రజలు త్యాగం ఉంది. ఇక లక్షల మందికి ఉపయోగపడే కార్యక్రమం అయితే.. వందల మంది త్యాగం తప్పనిసరి. అందుకే వారి త్యాగానికి గుర్తుగా తగిన ప్రతిఫలం అందిస్తారు. ఇక సమాజానికి ఉపయోగపడే మహా నిర్మాణంలో భాగస్వామ్యులను ఘనంగా సత్కరిస్తారు కూడా. అయితే ఓ మహా నిర్మాణంలో భాగస్వాములు అయిన కొన్ని ఊర్ల ప్రజలు మాత్రం ఇప్పుడు తీవ్ర భావోద్వోగానికి గురవుతున్నారు.

Also Read : ఉత్తరాంధ్రలో మరో భారీ పరిశ్రమ

దశాబ్దాల కల ఈ నెల 31వ తేదీన సాకారం అవుతోంది. తీవ్రమైన కరువుతో అల్లాడిపోతున్న రాయలసీమ ప్రాంతంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కనుంది. కొండను తొలిచి మరీ కృష్ణమ్మను మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల వాసులకు తాగు, సాగు నీరు అందించనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద నీటిని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో నిర్మించిన సొరంగం ద్వారా దోర్నాల, పెద్దారవీడు, మార్కాపురం, కంభం, అర్ధవీడు, గిద్దలూరు మీదుగా నెల్లూరు జిల్లాలో శివారు ప్రాంతాల మీదుగా, కడప జిల్లా బద్వేలు మీదుగా నల్లమల సాగర్‌ వరకు కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది. ఇందుకోసం భారీ సొరంగంతో పాటు మార్కాపురం జిల్లా గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల వద్ద కొండల మధ్యలో గ్యాప్ ఫిల్ చేసేందుకు భారీ కాంక్రీట్ గోడలు నిర్మించారు.

Also Read : సబ్ రిజిస్ట్రార్‌కు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు..!

వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన గ్యాప్ ఫిల్లింగ్‌తో కొండలకు అవతల వైపు ఉన్న గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే ఈ గ్రామాలు ముంపునకు కూడా గురవుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు పునరావాస కాలనీలను ప్రభుత్వం ఇప్పటికే నిర్మించింది. అలాగే నష్టపోతున్న రైతులు, గ్రామస్థులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం, పునరావాసం కల్పించింది ప్రభుత్వం. వెలిగొండ ప్రాజెక్టు వల్ల 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుంది. వెలిగొండ టన్నెల్స్ నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

Also Read : క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్‌కు అవమానకర రికార్డు..!

దీంతో ఈ గ్రామాలకు రైతులు, ప్రజలు ప్రస్తుతం ఊర్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. ఏడాది క్రితం వరకు ప్రాజెక్టు పూర్తి అయినప్పుడు చూద్దాం లే అని ధీమాతో ఉన్న గ్రామాల వాసులు.. చంద్రబాబు సర్కార్ శరవేగంగా పనులు పూర్తి చేయడంతో.. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఊర్లు ఖాళీ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పుట్టిన ఊరిని, ఉన్న ఇంటిని వదిలి వెళ్తుండటంతో గ్రామస్తులు భావోద్వేగానికి గురవుతున్నారు. పది మందికి మంచి జరగటం కోసం తమ ఊరిని వదిలి వెళ్తున్నందుకు ఓ వైపు సంతోషంగా ఉన్నప్పటికీ.. ఇంత కాలం తమకు నీడ నిచ్చిన ఇల్లు, తిండి పెట్టిన భూమిని వదిలి వెళ్తున్నందుకు కన్నీరు పెట్టుకుంటున్నారు. పిల్లా జల్లాతో కలిసి పెట్టేబేడ సర్ధుకుని.. మార్కాపురం సమీపంలో నిర్మించిన పునరావాస కాలనీలకు బరువెక్కిన గుండెలతో చేరుకుంటున్నారు. ఇక వృద్ధులు అయితే ఊరితో, భూమితో తమకున్న జ్ఞాపకాలను నెమరువేసుకుని కన్నీరు పెడుతున్నారు. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సమయంలో భూములిచ్చిన రైతులను ఘనంగా సన్మానించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గ్రూప్-1 స్కామ్‌.. జగన్‌కు...

APPSC గ్రూప్‌-1 మూల్యాంకనంలో భారీ అక్రమాలకు...

ప్రత్యక్ష ఎన్నిక.. చంద్రబాబు...

స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు జోరందుకున్నాయి....

సబ్ రిజిస్ట్రార్‌కు టీడీపీ...

అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే...

సాయి రెడ్డితో రాజీ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్...

ఆగస్టు 24 నుండి...

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట...

భోగాపురం నుంచి విశాఖ...

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి సర్కార్ చర్యలు...

పోల్స్