Monday, October 12, 2026 07:44 AM
Monday, October 12, 2026 07:44 AM

టాటా ఈవీ కార్లకు విపరీతమైన డిమాండ్..!

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్రయాణీకుల వాహన శ్రేణికి మార్కెట్లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఆగస్ట్ 2026 నాటి తాజా డెలివరీ టైమ్‌లైన్స్ పరిశీలిస్తే.. టాటా పెట్రోల్, డీజిల్ మరియు సీఎన్‌జీ మోడళ్లు కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే కస్టమర్ల చేతికి అందుతుండగా, ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం డిమాండ్ భారీగా పెరగడంతో వెయిటింగ్ పీరియడ్ ఏకంగా 24 వారాల అంటే ఆరు నెలల సమయం పడుతోంది. టాటా ఎలక్ట్రిక్ వాహనాలలో అత్యంత ప్రజాదరణ పొందిన టియాగో EV, పంచ్ EV మోడళ్ల కోసమే కస్టమర్లు అత్యధిక కాలం వేచి చూడాల్సి వస్తోంది.

Also Read : లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి అరెస్ట్.. నెక్ట్స్‌ బిగ్‌బాస్?

టియాగో ఈవీ స్మార్ట్ 19, ప్యూర్+ 19 వేరియంట్లతో పాటు, పంచ్ ఈవీ స్మార్ట్ 30 వేరియంట్‌ను బుక్ చేసుకుంటే డెలివరీ కావడానికి కనీసం 18 నుంచి 24 వారాల సమయం పడుతోంది. అలాగే సరికొత్త సియెర్రా ఈవీ మోడల్‌కు కూడా 12 నుండి 15 వారాల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల పరిస్థితి ఇలా ఉంటే, ఐసీఈ వేరియంట్లు అయిన పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రం చాలా వేగంగా డెలివరీ అవుతున్నాయి. టాటా టిగోర్, ఆల్ట్రోజ్ మోడళ్లు అన్ని పవర్‌ట్రైన్లలో కేవలం 1 నుండి 2 వారాల్లోనే అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే నెక్సాన్ పెట్రోల్/సీఎన్‌జీ వేరియంట్లు, కర్వ్ ఈవీ మరియు కర్వ్ పెట్రోల్ మోడళ్లు కూడా కేవలం 1 నుండి 2 వారాల అత్యల్ప వ్యవధిలోనే డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి.

Also Read : ఏపీ సంక్షేమ పథకాలే స్ఫూర్తిగా..? విజయ్ కీలక ప్రకటన..!

టాటాకు చెందిన పాపులర్ ఎస్‌యూవీలు హారియర్ పెట్రోల్, సఫారీ పెట్రోల్ మోడళ్ల కోసం కస్టమర్లు 10 నుండి 12 వారాలు వేచి చూడాల్సి వస్తుండగా, వీటి డీజిల్ వేరియంట్లు మాత్రం కేవలం 2 నుండి 3 వారాల్లోనే డెలివరీ అవుతున్నాయి. అదే సమయంలో హారియర్ ఈవీ కూడా కేవలం 2 నుండి 3 వారాల తక్కువ వ్యవధిలోనే లభిస్తుండటం విశేషం. మార్కెట్లో ఐసీఈ/సీఎన్‌జీ కార్ల సరఫరా వేగంగా ఉన్నప్పటికీ, బడ్జెట్ ఈవీ కార్ల తయారీ మరియు బ్యాటరీ డిమాండ్ కారణంగానే పంచ్, టియాగో ఈవీల డెలివరీల్లో ఈ స్థాయి ఆలస్యం జరుగుతోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఆధార్‌లో పేరు మార్చుకోవాలా?...

ఆధార్ కార్డులో పేరు సవరణ, మార్పులకు...

బ్రేకింగ్: రెండు రోజుల్లో...

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న...

బీసీ రిజర్వేషన్లపై ఏపీ...

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

తిరుమల నడక దారి...

తిరుమల కొండకు కాలిబాటన వచ్చే భక్తుల...

సచివాలయ ఉద్యోగుల గుండెల్లో...

ఇటీవల విజయవాడలో ఆందోళన నిర్వహించిన గ్రామ,...

పోల్స్