Monday, October 12, 2026 05:21 AM
Monday, October 12, 2026 05:21 AM

టెక్కీలకు ట్రంప్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం..!

అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశపడే ఐటీ నిపుణులకు, భారతీయ టెక్కీలకు ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా 1,00,000 డాలర్ల అంటే సుమారు 96 లక్షలు చేసింది. ఈ మేరకు తాజాగా ట్రంప్ యంత్రాంగం సరికొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చింది. కొత్తగా హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలు, సాధారణ ఫీజులతో పాటు ఈ అదనపు మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది ఫెడరల్ కోర్టు ఈ ఫీజు పెంపును అడ్డుకున్నప్పటికీ, ప్రభుత్వం ఈ విధానాన్ని శాశ్వతం చేసేందుకు పట్టుబడుతోంది.

Also Read : సిబిఐ పై జగన్ గౌరవం.. న్యాయమూర్తులు, లాయర్లు షాక్

ఈ భారీ ఫీజు పెంపు ప్రభావం అత్యధికంగా భారతీయులపైనే పడనుంది. అమెరికాలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న వారిలో దాదాపు 70 శాతం మంది భారతీయ నిపుణులే ఉన్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం, విదేశాల నుండి నేరుగా ప్రతిభావంతులైన భారతీయులను నియమించుకోవడానికి అమెరికన్ కంపెనీలు వెనుకాడే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే అమెరికాలో స్టూడెంట్ వీసాలపై ఉన్నవారికి మరియు వీసా రినెవల్ చేసుకునే వారికి ఈ అదనపు ఫీజు వర్తించదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read : నన్ను వేధించోద్దు ప్లీజ్.. అంబటి సంచలన కామెంట్స్..!

అమెరికా స్థానిక ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. తక్కువ జీతాలకే లభించే విదేశీ కార్మికులతో స్థానికులను భర్తీ చేయకుండా కంపెనీలను నిరోధించడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఈ ప్రతిపాదన 30 రోజుల ప్రజాభిప్రాయ సేకరణలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది ముగింపు దశకు వచ్చే అవకాశం ఉండటంతో, అమెరికా వ్యాపార వర్గాలు మరియు ఐటీ సంస్థలు దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఆధార్‌లో పేరు మార్చుకోవాలా?...

ఆధార్ కార్డులో పేరు సవరణ, మార్పులకు...

బ్రేకింగ్: రెండు రోజుల్లో...

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న...

బీసీ రిజర్వేషన్లపై ఏపీ...

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

తిరుమల నడక దారి...

తిరుమల కొండకు కాలిబాటన వచ్చే భక్తుల...

సచివాలయ ఉద్యోగుల గుండెల్లో...

ఇటీవల విజయవాడలో ఆందోళన నిర్వహించిన గ్రామ,...

పోల్స్