ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన మరియు రవాణా రంగ విస్తరణే ధ్యేయంగా సరికొత్త భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో 2,344.12 ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. మందగించిన రాజధాని అభివృద్ధి పనులకు ఈ తాజా నిర్ణయం సరికొత్త ఊపును ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
Also Read : మళ్ళీ తెరమీదకు బీసీ కార్డు.. పాత చరిత్ర మరిచిపోయావా రజనీ?
అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా ఈ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ మెగా భూసమీకరణ ద్వారా రాజధాని నిర్మాణ వేగం మరింత పెరుగుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం సేకరించ తలపెట్టిన భూమిలో 1,654.259 ఎకరాలు ప్రైవేట్ పట్టా భూములుగా గుర్తించారు. మిగిలిన విస్తీర్ణం మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిగా ఏపీసీఆర్డీఏ రికార్డుల్లో స్పష్టం చేయడం జరిగింది. ఈ భూసమీకరణ ప్రక్రియకు సంబంధించి స్థానిక రైతులతో పలు దఫాలుగా గ్రామసభలు నిర్వహించడం జరిగింది.
Also Read : గుండెపోటు ముప్పును ముందే గుర్తించే టెస్ట్..!
భూములిచ్చే రైతులకు రాజధాని నిబంధనల ప్రకారం ప్యాకేజీలు, కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్ల కేటాయింపు ఉంటుంది. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని సీఆర్డీఏ అధికారులు వెల్లడించారు. భూసమీకరణకు సంబంధించి త్వరలోనే పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విడత భూసమీకరణను ప్రధానంగా అమరావతికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం వినియోగిస్తారు. దీనితో పాటు రాజధాని ప్రాంతాన్ని కనెక్ట్ చేసే సరికొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు కేటాయిస్తారు. ఈ రెండు బృహత్తర ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే అమరావతి రవాణా వ్యవస్థలో మార్పులు వస్తాయి.

