Wednesday, October 14, 2026 06:34 AM
Wednesday, October 14, 2026 06:34 AM

ఆసియా క్రీడల్లో క్రికెటర్లకు ఘోర పరిస్థితులు.. జపాన్‌పై బీసీసీఐ ఫైర్..!

జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా వచ్చే నెల సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కాబోయే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లోక్రీడాకారులకు కల్పిస్తున్న వసతులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అక్కడ క్రికెటర్ల కోసం ఏర్పాటు చేసిన నివాస, డ్రెస్సింగ్ రూమ్ సౌకర్యాలు అత్యంత దారుణంగా ఉన్నాయంటూ జపాన్ ఒలింపిక్ అధికారుల తీరుపై బీసీసీఐ మండిపడింది. ఒకవేళ వసతులలో ఎలాంటి మార్పులు లేకపోతే, ఈ టోర్నమెంట్‌కు తమ ప్రధాన జట్టును కాకుండా ‘బి’ టీమ్‌ను పంపించే యోచనలో ఉన్నట్లు బోర్డు వర్గాలు సంచలన ప్రకటన చేశాయి.

Also Read : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్‌గా తెలుగు ఐఏఎస్..!

బీసీసీఐ ప్రతినిధులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్కడ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్‌లు నిర్మించకుండా, కేవలం టెంట్లు వేసి సరిపెట్టారు. అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే, ఆటగాళ్లు వాడుకునే వాష్ రూమ్‌లు ఆ టెంట్లకు దాదాపు ఐదు వందల మీటర్ల సుదూర దూరంలో ఉన్నాయి. దీనికి తోడు క్రీడాకారులకు కేటాయించిన హోటల్ గదులు కూడా అత్యంత చిన్నవిగా ఉండటం ఆటగాళ్ల మానసిక ప్రశాంతతను దెబ్బతీసే విధంగా ఉందని బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read : ఇలా అయితే మా వల్ల కాదు..!

అంతర్జాతీయ స్థాయి మెగా ఈవెంట్‌లో ఇలాంటి నాసిరకం ఏర్పాట్లు చేయడంపై ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ సమావేశంలోనే జపాన్ అధికారులను బీసీసీఐ నిలదీసింది. గత చైనా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన టీమిండియా, ఈసారి కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి సూపర్ స్టార్లతో కూడిన అత్యంత బలమైన ప్రధాన జట్టును ప్రకటించింది. మహిళల జట్టుకు కూడా హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత, సౌకర్యాలను పరిశీలించడానికి బీసీసీఐ త్వరలోనే ఒక ప్రత్యేక పరిశీలకుడిని జపాన్‌కు పంపనుంది. ఆ పరిశీలకుడు ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రధాన జట్టును పంపాలా, లేదా యువ ఆటగాళ్లతో కూడిన ‘బి’ జట్టును పంపాలా అనేదానిపై బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీని తుడిచేస్తున్న చిన్న...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి...

తెలంగాణ బీజేపీలో కాక్రోచ్...

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్...

విశాఖ మేయర్ రిజర్వేషన్...

బీజేపీ నేతల ఒత్తిళ్లతోనే విశాఖపట్నం నగర...

జగన్ ను భయపెడుతోన్న...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

ఏపీ జడ్పీ ఛైర్మన్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

మంగళగిరి మేయర్‌ పీఠం...

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి...

పోల్స్