Tuesday, October 13, 2026 09:38 PM
Tuesday, October 13, 2026 09:38 PM

జగన్‌ని భయపెడుతున్న ఇండియా టుడే సర్వే

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. మరోసారి పవర్‌లోకి రావాలని పగటి కలలు కంటున్నాడు.. వాటికి బ్రేక్‌ వేసింది ఇండియా టుడే – సీ ఓటర్‌ మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే. కూటమి పాలనపై ప్రజా వ్యతిరేకత మొదలయిందని, ఇటీవల వైసీపీ అనుకూల సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిపై తన ప్రెస్‌ మీట్‌లోనే ప్రశ్నలు అడిగించుకొని సంబరపడి పోయాడు జగన్‌. అది ఫేక్‌ సర్వే అని, అంత సీన్‌ లేదని 2024 ఎన్నికలలో వైసీపీ విజయం ఖాయమని తేల్చి చెప్పిన సర్వే నిపుణుడు ఆరా మస్తాన్‌ బల్ల గుద్ది మరీ చెప్పాడు.

Also Read : వైసీపీ నేతలను జగన్ కావాలనే రెచ్చగొడుతున్నారా..?

ఆరా మస్తాన్‌ వివరణతో డల్‌ అయిన వైసీపీ టీమ్‌కి, తాజాగా మూడ్‌ ఆఫ్‌ నేషన్‌ సర్వేతో క్లియర్‌ పిక్చర్‌ వచ్చిందనే చర్చ మొదలయింది. సీ ఓటర్‌తో కలిసి ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఇండియా టుడే ప్రజల అభిప్రాయాలని, వారి ఆలోచన సరళిని, దేశంలో ప్రస్తుత రాజకీయ ట్రెండ్స్‌ని అంచనా వేస్తుంది. దేశవ్యాప్తంగా వేలమంది అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకుంటుంది. ఆగస్ట్‌ మూడవ వరకు చేసిన ఈ తాజా సర్వేలో మరోసారి ఢిల్లీ పీఠంపై ఎన్‌డీఏ కూటమి జెండా ఎగరవేయడం ఖాయం అని తేల్చి చెప్పింది.

ప్రస్తుతం ఎన్నికలు జరిగితే, ఎన్‌డీఏ కూటమికి 326 ఎంపీ స్థానాలు, ఇండీ కూటమికి 185 సీట్లు వస్తాయని తెలిపింది. కేవలం బీజేపీ 261 స్థానాలు గెలవనుందని వివరించింది. ఇక, కాంగ్రెస్‌ గతం కంటే కాస్త కోలుకొని 106 సీట్లు దక్కించుకుంటుందని ప్రకటించింది. జెన్‌ జీ, కాక్‌రోచ్‌ జనతా పార్టీ ఉద్యమంతో ఎన్‌డీఏ హవా ముగిసిందని, ఇక తాను కాంగ్రెస్‌ కూటమిలోకి జంప్‌ చేయవచ్చని వైసీపీ అధినేత జగన్‌ గత కొంతకాలంగా భావిస్తున్నారనే లీకులు బయటకు వస్తున్నాయి. బెంగళూరులో ఇటీవల జగన్‌… కాంగ్రెస్‌ కీలక నేత కేసీ వేణుగోపాల్‌ని సీక్రెట్‌గా కలిశారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం తర్వాతే వైసీపీలోని కీలక నేతలపై ఈడీ ఎటాక్స్‌ మొదలయ్యాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.

Also Read : SC, STలకు జగన్‌ వెన్నుపోటు..!

ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి సమర్ధవంతమైన పాలన అందిస్తోంది. అభివృద్ది, సంక్షేమంతో దూసుకుపోతోంది. జగన్‌ విధ్వంసకర పాలన నుండి కోలుకుంటోంది.. ఏపీ రెవెన్యూ కూడా మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలో జగన్‌కి మరోసారి చాన్స్‌ ఇవ్వడానికి ప్రజలు రెడీగా లేరు. జగన్‌ ప్రమోటెడ్‌ సర్వేలు మినహా, టాప్‌ మోస్ట్ స్ట్రాటజిస్టులు సైతం ఏపీలో ఎన్‌డీఏ కూటమి హవాని తేల్చిపారేస్తున్నాయి. ఈ విషయం జగన్‌కి బాగా తెలుసు. ఇదే వైసీపీని టెన్షన్‌ పెడుతోంది. మరి, రాబోయే రోజుల్లో జగన్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకొని పార్టీని గట్టెక్కిస్తాడో ఆసక్తికరంగా మారుతోంది..

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీని తుడిచేస్తున్న చిన్న...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి...

తెలంగాణ బీజేపీలో కాక్రోచ్...

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్...

విశాఖ మేయర్ రిజర్వేషన్...

బీజేపీ నేతల ఒత్తిళ్లతోనే విశాఖపట్నం నగర...

జగన్ ను భయపెడుతోన్న...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

ఏపీ జడ్పీ ఛైర్మన్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

మంగళగిరి మేయర్‌ పీఠం...

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి...

పోల్స్