ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల దశాబ్దాల కలను సాకారం చేస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రతిష్టాత్మక “పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు” తొలి దశ ప్రారంభం కావడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అద్భుతమైన స్పందన తెలియజేస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కావడంతో సామాజిక మాధ్యమాల్లో ‘వెలిగొండ ప్రాజెక్ట్’ హవా నడుస్తోంది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల వేదికగా ‘వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం’ అనే హ్యాష్ ట్యాగ్ నేషనల్ లెవెల్లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.
Also Read : పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ వెనుక అసలు వ్యూహం ఇదేనా..?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేసిన విజువల్స్, కృష్ణా సాష్టాంగ ప్రణామం చేసిన భావోద్వేగ దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. రాయలసీమ మరియు ప్రకాశం జిల్లా నెటిజన్లు, రైతాంగం తమ దశాబ్దాల దాహార్తిని, కరువును తీర్చే ప్రాజెక్టు అందుబాటులోకి రావడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పం మరియు కూటమి ప్రభుత్వ వేగవంతమైన ప్రణాళికల వల్లే ఈ అద్భుత ఘట్టం సాకారమైందంటూ నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది.
Also Read : బెజవాడ మేయర్ పీఠం కోసం సిగపట్లు..!
“వెలిగొండ జలసిరులు – అభివృద్ధికి రెక్కలు” అంటూ ఐటీ ప్రొఫెషనల్స్ నుంచి క్షేత్రస్థాయి రైతుల వరకు ప్రతి ఒక్కరూ పోస్టులు పెడుతుండటంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు హోరెత్తిపోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కేవలం నీటి విడుదల కాదని, సీమ పల్లెల్లో సరికొత్త ఆర్థిక విప్లవానికి నాంది అని విశ్లేషకులు సైతం సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు. 30 ఏళ్ళ క్రితం ఈ ప్రాజెక్ట్ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

