రాయలసీమ ప్రాంత సమగ్ర రూపురేఖలను మార్చేలా, అక్కడి పల్లెల్లో సరికొత్త ప్రగతి కాంతులు నింపేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక విజన్‌తో ముందుకు సాగుతున్నారు. రాయలసీమ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా మొత్తం రూ. 8,022 కోట్ల భారీ బడ్జెట్‌తో గ్రామాలు, అటవీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు.
Also Read : జగన్‌ని భయపెడుతున్న ఇండియా టుడే సర్వే
నీరు, రోడ్లు, పచ్చదనం, ఉపాధి వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి సీమను పల్లె సీమల ప్రగతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తున్నారు. ఈ భారీ కార్యాచరణలో భాగంగా రాయలసీమ అంతటా రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూ. 4,523 కోట్లతో 23,000కు పైగా రోడ్ల పనులను చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే 5,238 కిలోమీటర్ల మేర నాణ్యమైన బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. దీంతో పాటు, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ 62 వేల ఎకరాల్లో ఉద్యాన సాగును ప్రోత్సహించారు.
Also Read : విశాఖకు మణిహారం.. ప్రముఖ ఆస్పత్రి వచ్చేసింది.
ఈ వినూత్న నిర్ణయం ద్వారా సీమ వ్యాప్తంగా సుమారు 28 వేల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరింది. ఎప్పుడూ వర్షాభావ పరిస్థితులతో తల్లడిల్లే రాయలసీమలో భూగర్భ జలాల వృద్ధికి పవన్ కల్యాణ్ మార్కు వ్యూహం అద్భుత ఫలితాలను ఇస్తోంది. గ్రామాలవారీగా నీటి కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం వల్ల భూగర్భ జలమట్టం పెరిగి, ఏకంగా 50 వేలకు పైగా ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగింది. అలాగే, సీమ ప్రజల దశాబ్దాల దాహార్తిని శాశ్వతంగా తీర్చేందుకు ‘జేజేఎం-అమరజీవి జలధారలు’ సిద్ధమవుతున్నాయి. అటు పల్లెల్లోనే కాకుండా, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం కోసం 13 నగర వనాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

