Wednesday, September 2, 2026 11:09 AM
Wednesday, September 2, 2026 11:09 AM

హిట్ అండ్ రన్.. మరో జనసేన నేత కొడుకు..!

హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. సరిగ్గా పది రోజుల క్రితం హైదరాబాద్‌లోని మాదాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. ఈ ప్రమాదానికి జనసేన పార్టీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ నిర్లక్ష్యం కారణమని ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వేడి చల్లారక ముందే జనసేన పార్టీకి చెందిన మరో నేత కుమారుడిని హైదరాబాద్ పోలీసులు హిట్ అండ్ రన్ కేసులో అరెస్టు చేశారు.

Also Read : టాలీవుడ్‌లో మైండ్ బ్లోయింగ్ కాంబో..!

హైదరాబాద్‌లోని ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ఇన్నోవా కార్ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పక్కనే ఉన్న జైద్ షా అనే విద్యార్థి నందులాలను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. మరో ప్రమాదం జరిగింది. వెనక నుంచి వేగంగా వచ్చిన కారు.. విద్యార్థి జైద్ షా ను ఢీ కొట్టి.. ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నందూలాల మృతి చెందగా.. జైద్ షా తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదానికి కారణమైన మహీంద్రా కార్ యజమానిని పోలీసులు గుర్తించారు.

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్ మహీంద్ర కార్ డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కారు సీజ్ చేసిన పోలీసులు.. సందీప్‌ను అరెస్ట్ చేశారు. గత నెల 16వ తేదీన మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్ వద్ద ఓ యువతి రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన భారతి ముఖీ అనే యువతి మృతి చెందింది. ఈ ప్రమాదానికి కారణమైన కారు జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే యువతిని తన కారులోనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ యువతి మృతి చెందినట్లు తెలిపారు.

Also Read : కేఏ పాల్ ని కదిపి బొత్స పరువు పోగొట్టుకున్నాడా?

జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతల కుమారులు ఇలా హిట్ అండ్ రన్ కేసుల్లో ఇరుక్కోవడం రాజకీయ దుమారం రేపుతోంది. సరిగ్గా రెండు నెలల క్రితమే వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు కుమారుడు బైక్ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ కేసులో సాక్ష్యాలు తారు మారు చేశారని, అలాగే ప్రమాదం జరిగిన తర్వాత తన కుమారుడిని తప్పించే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో సీదిరి అప్పల్రాజును పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 20 రోజులు జైలులో రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఇదే తరహా కేసుల్లో జనసేన నేతల వారసులు కూడా ఇరుక్కోవడంతో వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నారు.

సీదిరి అప్పల్రాజుకు ఓ న్యాయం, జనసేన నేతలకు ఓ న్యాయమా అంటూ విమర్శలు చేస్తున్నారు. సీదిరి అప్పల్రాజును అరెస్టు చేసినట్లుగానే జనసేన నేతలను కూడా అరెస్టు చేయాలంటున్నారు. జనసేన నేతల వారసులు చేసిన ప్రమాదాలపై ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వెలిగొండ.. నీటి పంపకాల...

30 ఏళ్ల కల సాకారమైంది. శ్రీశైలం...

చరిత్ర సృష్టించబోతున్న ఉత్తరాంధ్ర.....

ఉత్తరాంధ్ర రైతాంగ దశాబ్దాల కల నెరవేరబోతోంది....

అవును సజ్జల కొట్టాడు.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

నెట్టింట వెలిగొండ డామినేషన్.....

ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల దశాబ్దాల...

సీమ పల్లెలపై పవన్...

రాయలసీమ ప్రాంత సమగ్ర రూపురేఖలను మార్చేలా,...

బెజవాడ మేయర్ పీఠం...

విజయవాడలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. స్థానిక...

పోల్స్