Sunday, October 18, 2026 05:35 AM
Sunday, October 18, 2026 05:35 AM

కావ్య – కాలభైరవ లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది..?

టాలీవుడ్‌లో మరో ప్రముఖ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోంది. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, ‘బలగం’ సినిమా ఫేమ్ హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్, ప్రముఖ సంగీత దర్శకుడు కాలభైరవ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎట్టకేలకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒకరిపై ఒకరు ఉన్న ఇష్టాన్ని.. అభిమానులతో పంచుకున్నారు. ఈ ప్రకటనతో నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read : మలేరియాపై భారత్ విజయం.. కేంద్రం కీలక ప్రకటన..!

అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందనే విషయంపై ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మరియు అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. కాలభైరవ తమ్ముడు శ్రీసింహ హీరోగా నటించిన ‘ఉస్తాద్’ సినిమాలో కావ్య కళ్యాణ్‌రామ్ హీరోయిన్‌గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఆ చిత్రానికి కాలభైరవ పాటలు పాడటంతో, ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని సమాచారం. ఆ స్నేహం కాస్తా రానురాను బలపడి, ఇప్పుడు ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి పీటల దాకా వచ్చేలా చేసిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : కూరగాయలు తినడం ఇష్టం లేదా..? న్యూట్రిషనిస్ట్ సంచలన చిట్కా..!

బాలనటిగా కెరీర్ ప్రారంభించి దాదాపు పదికి పైగా సినిమాల్లో నటించిన కావ్య, ‘మసూద’ చిత్రంతో హీరోయిన్‌గా మారి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘బలగం’ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన భారీ విజయం ఆమెను స్టార్‌గా మార్చేసింది. హీరోయిన్‌గా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కావ్య, ఇప్పుడు ఆస్కార్ విజేత, దిగ్గజ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇంట కోడలిగా అడుగుపెట్టబోతుండటం విశేషం. త్వరలోనే ఈ జంట వివాహానికి సంబంధించిన తేదీలు, ఇతర పూర్తి వివరాలను కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

హోం మంత్రి పదవి...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి...

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

పోల్స్