Sunday, August 30, 2026 11:02 AM
Sunday, August 30, 2026 11:02 AM

కూరగాయలు తినడం ఇష్టం లేదా..? న్యూట్రిషనిస్ట్ సంచలన చిట్కా..!

మనలో చాలా మందికి కూరగాయలు నేరుగా తినడం అస్సలు ఇష్టం ఉండదు. చిన్నప్పుడు తల్లులు బలవంతంగా తినిపించినా, పెద్దయ్యాక కూడా ఆ అలవాటు మార్చుకోలేక వాటికి దూరంగా ఉంటారు. అయితే, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా, ఆరోగ్యంగా మరియు యవ్వనంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 9 కప్పుల కూరగాయలను ఖచ్చితంగా తీసుకోవాలని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ స్పష్టం చేస్తున్నారు. యాంటీ ఏజింగ్ సైన్స్ పరిశోధనల ప్రకారం ఈ నియమం అత్యంత కీలకమని, కూరగాయలు ఇష్టం లేని వారు కూడా ఈ 9 కప్పుల కోటాను ఎలా సులభంగా పూర్తి చేయాలో ఆమె కొన్ని వినూత్నమైన మార్గాలను వివరించారు.

Also Read : టాక్సిక్ అట్టర్ ఫ్లాప్.. కానీ లాభాల పంట పండిందా..?

కూరగాయలను వండుకుని నేరుగా తినడం ఇబ్బందిగా భావించే వారు వాటిని జ్యూస్ రూపంలో తీసుకోవడం ఉత్తమమైన మార్గమని ఆమె సూచించారు. ఉదాహరణకు.. టొమాటో, క్యారెట్, బీట్‌రూట్ కలిపిన మిశ్రమ జ్యూస్ లేదా పుదీనా, కొత్తిమీరతో చేసిన గ్రీన్ జ్యూస్‌లను రోజుకు 2 గ్లాసులు తాగితే చాలు, దాదాపు 6 కప్పుల కూరగాయలను తీసుకున్న కోటా పూర్తి అవుతుంది. ఈ వెజిటబుల్ జ్యూస్‌లు తాగడానికి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా, శరీరానికి తక్షణ పోషకాలను అందిస్తాయి.

Also Read : హెచ్ 1 బీ రద్దు యోచనలో ట్రంప్ సర్కార్

అయితే జ్యూస్‌లు తాగుతున్నప్పుడు పూర్తిగా హోల్ వెజిటబుల్స్‌ను పక్కన పెట్టకుండా ఇతర రూపాల్లో కూడా ప్రయత్నించాలని ఆమె పేర్కొన్నారు. ఇక మిగిలిన 3 కప్పుల కోసం సలాడ్లు మరియు సాధారణ వంటకాలను ఆశ్రయించవచ్చు. కూరగాయలు నచ్చని వారు కూడా బొప్పాయి సలాడ్, ఆకుకూరల సలాడ్, లేదా దానిమ్మ మరియు కీరదోసకాయ సలాడ్లను ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి ఒక కప్పు సలాడ్ ద్వారా 2 కప్పుల కూరగాయల కోటా పూర్తవుతుంది. ఇక చివరిగా మిగిలిన 1 కప్పు కోటాను మనం రోజువారీ ఇంట్లో వండుకునే సాధారణ కూర ద్వారా చాలా సులభంగా భర్తీ చేయవచ్చు. ఈ పద్ధతిని పాటిస్తే కూరగాయలు తినడం ఇష్టం లేని వారు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజూ 9 కప్పుల టార్గెట్‌ను పూర్తి చేసి నిత్య యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండవచ్చని అంజలి ముఖర్జీ చెప్పుకొచ్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఐటీ సారధే కాదు.....

నారా చంద్రబాబు నాయుడు పేరు చెబితే...

సజ్జల వర్సెస్ విజయసాయి.....

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత...

జగన్‌ని భయపెడుతున్న ఇండియా...

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌...

వైసీపీ నేతలను జగన్...

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే రాబోయే స్థానిక సంస్థల...

SC, STలకు జగన్‌...

BCలనే కాదు..వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలను...

300 కోట్ల పెట్టుబడి.....

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడమే...

పోల్స్