Sunday, September 13, 2026 11:41 PM
Sunday, September 13, 2026 11:41 PM

మంగళగిరిలో లోకేష్ మార్క్.. మాట నిలబెట్టుకున్న మంత్రి..!

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల భూ సమస్యలకు మంత్రి నారా లోకేష్ శాశ్వత ముగింపు పలికారు. మన ఇల్లు – మన లోకేష్ పేరిట రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన మంగళగిరిలో అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ మెగా డ్రైవ్‌ లో నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు వెయ్యి కోట్ల రూపాయల మార్కెట్ విలువ గల భూములను చట్టబద్ధమైన యాజమాన్య హక్కులతో మంత్రి అందజేశారు.

Also Read : కాక్రోచ్ దెబ్బకు దిగివచ్చిన కేంద్ర సర్కార్..!

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో పేదలు నివసించే స్థలాలకు ఎలాంటి భద్రత ఉండేది కాదని, రాజకీయ నాయకుల అండతో భూకబ్జాలు విపరీతంగా జరిగేవని గుర్తుచేశారు. ఆ అభద్రతను తొలగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. “ఈ రోజు మీ చేతుల్లో పెడుతున్న ఈ శాశ్వత భూపట్టా మీ కుటుంబానికి శ్రీరామరక్ష లాంటిది. చట్టబద్ధమైన ఈ పత్రాలు ఉన్నాక.. మీ అనుమతి లేకుండా మీ ఇంటి వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఎవరూ చేయలేరు” అని లోకేష్ లబ్ధిదారులకు స్పష్టం చేశారు.

Also Read : తొలిరోజే రణరంగం.. బొమ్మ దద్దరిల్లుతుందా..?

ఎన్నికల సమయంలో మంగళగిరి ఓటర్లకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో వేలాది మందికి పట్టాలిచ్చామని, ఇప్పుడు రెండో విడత కూడా పూర్తి పారదర్శకతతో పూర్తి చేశామన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు ఇళ్ల పట్టాలు ఇస్తే కేవలం కాగితాలకే పరిమితం అవుతాయని, కానీ తమ ప్రభుత్వం మాత్రం పట్టాలతో పాటు ఆయా లేఅవుట్లలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు కూడా బడ్జెట్ కేటాయించిందని వివరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్