Tuesday, July 21, 2026 12:36 PM
Tuesday, July 21, 2026 12:36 PM

తొలిరోజే రణరంగం.. బొమ్మ దద్దరిల్లుతుందా..?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎలా ఉంటాయో తొలిరోజే తేలిపోయింది. సమావేశాల తొలి రోజే పార్లమెంట్ ముట్టడితో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదే అదునుగా భావించిన విపక్షాలు టార్గెట్ మోదీ సర్కార్ అన్నట్లుగా మాటల తూటాలు పేలుస్తున్నారు. దీంతో రేపటి నుంచి పూర్తిస్థాయిలో జరగనున్న పార్లమెంట్ సమావేశాలు వాడీ వేడీగా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సమావేశాల ప్రారంభానికి ముందు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. వర్షాకాలం, పార్లమెంట్ సమావేశాలు రెండూ చురుగ్గా సాగితే దేశ సంక్షేమానికి మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఉభయ సభల్లో ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. అయితే సమావేశాలు ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి.

Also Read : కాషాయ పార్టీ గేమ్ ప్లాన్.. పెరుగుతున్న బలం..!

ప్రధాని మోదీ ప్రసంగంలో దేశ అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. అంతరిక్ష రంగ స్టార్టప్ స్కైరూట్ చేపట్టిన ‘విక్రమ్-1’ ప్రయోగం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ, సగటు వయస్సు 28 సంవత్సరాలున్న యువ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. ఇదే సందర్భంగా “నేను ఇక్కడ 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు” అంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ట్రయల్‌ను విజయవంతంగా పూర్తి చేసి సేవలకు సిద్ధం చేశామన్నారు ప్రధాని. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోని ఐదు దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందన్నారు.

మోదీ ప్రసంగం పైన, పార్లమెంట్ సమావేశాల పైన విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పేపర్ లీక్ వ్యవహారం, అయోధ్య రామాలయం విరాళాల అంశాలను ఈ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావిస్తామన్నారు. పేపర్ లీక్ ఘటనలపై సామాజిక కార్యకర్త సోనమ్ నిరాహార దీక్ష చేస్తున్నారని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని యువత డిమాండ్ చేస్తోందన్నారు. అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరగాలని కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి.

Also Read : కాక్రోచ్ దెబ్బకు దిగివచ్చిన కేంద్ర సర్కార్..!

పార్లమెంట్ వెలుపల, అది కూడా ప్రధాన రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, పెద్ద ఎత్తున యువత చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్త వరిస్థితులకు దారి తీసింది. కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చే సంస్థగా గుర్తింపు పొందింది. నీట్ పరీక్షలో అవకవతకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్యేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. పోలీసుల లాఠీ దెబ్బలను సైతం లెక్క చేయలేదు. ఢిల్లీ మహానగరంలో ముఖ్యమైన మెట్రో స్టేషన్లలో రాకపోకలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అలాగే పార్లమెంట్ ఆవరణలో కొంతసేపు మొబైల్ ఫోన్లు పని చేయలేదు. మొత్తానికి పార్లమెంట్ సమావేశాల ప్రారంభమే రణరంగంగా మారింది. ఇక రెండో రోజు నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో మరి..?

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

కాదంబరి జెత్వాని కేసులో...

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై...

పోల్స్