Saturday, May 30, 2026 10:57 PM
Saturday, May 30, 2026 10:57 PM

ఇరాన్ రూట్ బంద్.. భారత్ మాత్రం సేఫ్, కేంద్రం సీక్రెట్ వ్యూహం ఇదే..!

మధ్యప్రాచ్యంలో ఇరాన్ సంక్షోభం కారణంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గం పూర్తిగా మూతపడింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధ భయంతో గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలన్నీ ఆ రూట్ మార్చేస్తుంటే, భారత్ మాత్రం తన రహస్య దౌత్య వ్యూహం ద్వారా అదే ప్రమాదకరమైన మార్గం నుండి అత్యంత సురక్షితంగా ముడిచమురును దేశానికి చేరవేస్తోంది. ప్రస్తుతం ఈ డేంజర్ జోన్‌ లో 5 క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, ఒక ఎల్పీజీ ట్యాంకర్‌ తో సహా ఏకంగా 13 భారతీయ నౌకలు విజయవంతంగా ప్రయాణిస్తున్నాయి.

Also Read : ఏపీ ఇసుక స్కామ్‌ లో ఈడీ బిగ్ స్టెప్..!

ప్రపంచ దేశాలు ఆ జలాల్లోకి వెళ్లడానికే వణికిపోతుంటే.. శివాలిక్, నందాదేవి, జగ్ లాడ్కీ వంటి భారత నౌకలు ఎలాంటి ఆటంకం లేకుండా దూసుకుపోతుండటం అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌ గా మారింది. మిగిలిన దేశాల నౌకలు ఆఫ్రికా ఖండం చుట్టూ వేల కిలోమీటర్లు అదనంగా ప్రయాణిస్తూ భారీగా నష్టపోతుంటే, భారత్ మాత్రం చాణక్యంతో ముందుకెళ్తోంది. ఈ సక్సెస్ వెనుక భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నడిపిన అత్యంత రహస్య దౌత్యం ఉందని కేంద్ర రక్షణ, షిప్పింగ్ వర్గాలు వెల్లడించాయి.

ఇటు ఇరాన్ ప్రభుత్వంతోనూ, అటు పాశ్చాత్య దేశాలతోనూ నిరంతరం దౌత్యపరమైన సమన్వయం చేసుకుంటూ భారత నౌకలపై ఎలాంటి దాడులు జరగకుండా కేంద్ర విదేశాంగ శాఖ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసిందిఈ రక్షణ ఆపరేషన్‌లో భాగంగా ఏ నౌకను ముందుగా సురక్షితంగా బయటకు తీసుకురావాలనే దానిపై కేంద్రంలోని వివిధ కీలక మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ మరియు ఎరువుల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఒక ప్రియారిటీ లిస్ట్‌ను తయారు చేస్తాయి.

Also Read : గోదావరి జిల్లాల్లో మళ్లీ టైగర్ టెన్షన్..!

దేశ ఇంధన అవసరాలకు మరియు వ్యవసాయానికి అత్యంత అత్యవసరమైన చమురు, గ్యాస్ మరియు ఎరువులను తీసుకొచ్చే నౌకలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, విదేశాంగ శాఖ సహాయంతో ఆ నౌకలను ఆ క్షిపణి రణరంగం నుండి సురక్షితంగా భారతదేశ తీరాలకు చేరవేస్తున్నారు. . దేశ ఇంధన అవసరాలకు మరియు నిత్యావసరాల రవాణాకు ఎలాంటి ముప్పు రాకుండా కేంద్రం తీసుకున్న ఈ వ్యూహాత్మక అడుగు భారతదేశ దౌత్య రంగానికి దక్కిన అతిపెద్ద విజయంగా నిలిచింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమికి దూరంగా టీ...

ప్రొఫెసర్ నాగేశ్వర్.. నిజానికి ఇది ఒక...

తెలంగాణపై జనసేనాని గురి.....

గత కొన్నాళ్ళుగా తెలంగాణ రాజకీయాలపై జనసేన...

ఏపీ ఇసుక స్కామ్‌...

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో...

గోదావరి జిల్లాల్లో మళ్లీ...

పోలవరం జిల్లా పరిధిలో పెద్దపులి సంచారం...

బొల్లా బ్రహ్మనాయుడు పరార్.....

సైబరాబాద్ పరిధిలో సంచలనం సృష్టించిన ఒక...

కుల పిచ్చి దాటడమే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత, డిప్యూటీ...

పోల్స్