Saturday, May 30, 2026 08:32 PM
Saturday, May 30, 2026 08:32 PM

కూటమికి దూరంగా టీ బీజేపీ..!

ప్రొఫెసర్ నాగేశ్వర్.. నిజానికి ఇది ఒక ముగిసిన అధ్యాయం. జర్నలిస్టులు, విశ్లేషకులు.. తమ దగ్గర స్పష్టమైన సమాచారం, నమ్మదగిన సోర్స్ ఉంటే.. వారు చేసే వ్యాఖ్యలు, ఆరోపణలకు కట్టుబడి ఉంటారు. గాలి మాటలు, కట్టుకథలు చెబితే.. పరిణామాలు ఎలా ఉంటాయో నాగేశ్వర్‌కు తెలిసి వచ్చినట్లుంది. నోటికి వచ్చిన కథ అల్లడంతో.. ఆయనపై ఇప్పుడు పోలీసు కేసులు నమోదవుతున్నాయి. దీంతో అరెస్టు భయం పట్టుకున్న నాగేశ్వర్.. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర అంటూ కొత్త డ్రామా షురూ చేశారు. చివరికి ప్రెస్ మీట్ అని పెట్టి.. హైదరాబాద్‌లో కాలు ఎలా పెడతారో చూస్తామంటూ బెదిరించే స్థాయికి దిగజారారు.

Also Read : తెలంగాణపై జనసేనాని గురి.. పార్టీ నేతలతో కీలక భేటీ..!

ప్రెస్ మీట్ పేరుతో ఓ పది మంది ప్రెస్‌క్లబ్‌లో కూర్చుని.. బెదిరించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే అలా బెదిరించిన ఆ పదిమంది వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై కూడా నిత్యం విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. జర్నలిస్టు ముసుగులో రెచ్చిపోతున్న పది మందికి బీఆర్ఎస్, వైసీపీ ముఖ్య నేతల మద్దతు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు సీఎంలతో పాటు డిప్యూటీ సీఎం ను కూడా కనీస గౌరవం లేకుండా.. నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు.

తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉంటూ.. జర్నలిస్టు ముసుగులో ఏపీ నేతలపైన ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరి విశ్లేషణలో ఎక్కడా కూడా బీఆర్ఎస్, వైసీపీ నేతలను విమర్శిస్తున్నట్లు కనిపించదు కూడా. వీరిపైన తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించటం లేదు. దీంతో ఆ పది మంది మరింత రెచ్చిపోతున్నారు. వీరికి పార్టీలు మద్దతిస్తున్న విషయం కాంగ్రెస్ పెద్దలకు తెలిసినా కూడా.. ఒక్కరు కూడా ఖండించటం లేదు. ఏపీ గురించి మాట్లాడుతున్న సో కాల్డ్ జర్నలిస్టులు.. మేం హైదరాబాద్‌లో ఉంటాం.. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు.. అనే ధీమాతో.. ఇంకా చెప్పాలంటే పొగరుతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. కూటమి సర్కార్‌లో భాగస్వామ్యులను తిడుతున్నప్పటికీ.. తెలంగాణ బీజేపీ నేతలు మౌనంగా ఉన్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పరువు తీసినా కూడా.. టీ బీజేపీ నేతలకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read : సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్..!

నిజానికి కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కార్‌ ఏపీలోని తెలుగుదేశం పార్టీ అండతోనే కొనసాగుతోంది. 2024 ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 16 ఎంపీ స్థానాలతో అతి పెద్ద పార్టీగా తెలుగుదేశం ఉంది. అలాగే ఏపీలో గెలిచిన నలుగురు ఎంపీలు కూడా టీడీపీ, జనసేన మద్దతుతోనే గెలిచారని కాషాయ పార్టీ పెద్దలే ఒప్పుకున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇళ్లకు వెళ్లి గంటకు పైగా చర్చలు జరిపారు. అయినా సరే.. తెలంగాణ బీజేపీ నేతలకు మాత్రం.. ఏపీలోని పార్టీల అధినేతల పట్ల కనీస సాన్నిహిత్యం లేకుండా పోయింది. హైదరాబాద్ నడిబొడ్డున ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంపై లేనిపోని విమర్శలు చేస్తూ.. ఎలా వస్తారో చూస్తామంటూ బెదిరిస్తుంటే.. టీ బీజేపీ నేతలు.. ఎవర్రా మీరంతా.. అనే ఒక్క మాట అనలేక పోతున్నారు. అసలు కూటమిలో ఉన్నారా.. లేరా అనే అనుమానం వచ్చేలా టీ బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణపై జనసేనాని గురి.....

గత కొన్నాళ్ళుగా తెలంగాణ రాజకీయాలపై జనసేన...

ఏపీ ఇసుక స్కామ్‌...

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో...

గోదావరి జిల్లాల్లో మళ్లీ...

పోలవరం జిల్లా పరిధిలో పెద్దపులి సంచారం...

బొల్లా బ్రహ్మనాయుడు పరార్.....

సైబరాబాద్ పరిధిలో సంచలనం సృష్టించిన ఒక...

కుల పిచ్చి దాటడమే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత, డిప్యూటీ...

ఏపీకి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కేంద్రంలోని...

పోల్స్