Saturday, July 18, 2026 10:54 PM
Saturday, July 18, 2026 10:54 PM

‘రాకా’ షూటింగ్‌లో దీపికా డెడికేషన్..!

సినిమా గ్లామర్ ప్రపంచంలో నటీమణులు తమ వృత్తిపై చూపే అంకితభావం కొన్నిసార్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటనపై తన నిబద్ధతను చాటుకుంటూ హాట్ టాపిక్ అయింది. అట్లీ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకా’ షూటింగ్‌లో దీపిక పాల్గొన్న తీరు సంచలనంగా మారింది. త్వరలోనే తల్లి కాబోతున్న ఈ బ్యూటీ.. ప్రెగ్నెన్సీ కూడా లెక్క చేయకుండా కఠినమైన యాక్షన్ సీన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. సాధారణంగా నటీమణులు గర్భధారణ సమయంలో సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తుంటారు. కానీ దీపికా మాత్రం ‘రాకా’ సినిమాలోని అత్యంత కీలకమైన, రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌లను పూర్తి చేయడం ద్వారా వృత్తిపై తనకున్న గౌరవాన్ని చాటుకుంది.

Also Read : కూటమిలో లోకల్ వార్ టెన్షన్..!

దీపిక చూపిన ధైర్యం, క్రమశిక్షణ చిత్ర బృందానికి కూడా భారీగా స్ఫూర్తినిచ్చాయి. దీపిక భద్రత దృష్ట్యా ప్రొడక్షన్ టీమ్ సెట్స్ లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. నటనలో, ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో ఆమె ఏమాత్రం రాజీపడలేదు. కొన్ని కఠినమైన సన్నివేశాల్లో రిస్క్ వద్దని స్టంట్ మాస్టర్లు సూచించినా సీన్ పర్ఫెక్షన్ కోసం ఎక్కడా తగ్గకుండా డూప్ లేకుండానే ఫైట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది దీపిక. ఆమె చూపించిన ఈ అసాధారణ తెగువకు, ధైర్యానికి అల్లు అర్జున్ కూడా ఫిదా అయిపోయారు. రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో కేవలం సెట్స్‌కే హాజరవ్వడం ఎక్కువ అనుకుంటే.. దీపిక ఏకంగా రోపులు కట్టుకుని యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం చూసి షాక్ అయ్యానని బన్నీ చిత్ర యూనిట్ వద్ద వ్యాఖ్యానించారట. గర్భవతిగా ఉండి కూడా ఒక హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రంలో ఇంతటి కీలక పాత్రను అద్భుతంగా పోషించడం సామాన్యమైన విషయం కాదన్నాడంట అల్లు అర్జున్

సినిమాపై ఆమెకున్న ఈ డెడికేషన్ వల్లే ‘రాకా’ షూటింగ్ కూడా ప్లాన్ చేసుకున్న సమయానికే శరవేగంగా పూర్తవుతోందని తెలుస్తోంది. గతంలో అలియా భట్ కూడా ఒక హాలీవుడ్ యాక్షన్ సినిమా కోసం ఇలాగే శ్రమించి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. అప్పటికే రెండు నెలల గర్భం దాల్చిన అలియా భట్.. యాక్షన్ సన్నివేశాలు చేయడం కథకు చాలా కీలకం కావడంతో ఏమాత్రం వెనుకాడకుండా షూట్‌లో పాల్గొంది. ఇప్పుడు తాజాగా ‘రాకా’ సినిమాకు పనిచేస్తోన్న విదేశీ టెక్నీషియన్లు దీపికాలోని మాస్ యాంగిల్‌ చూసి షాక్ అవుతున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో అట్లీ ప్లాన్ చేసిన యాక్షన్.. దీపిక చూపించిన టైమింగ్, గ్రేస్ ఇంటర్నేషనల్ క్రూని కూడా ఆకట్టుకున్నాయి.

Also Read : మాజీ మంత్రి కోసం ఎస్సై రిస్క్.. ఎస్పీ రిటర్న్ గిఫ్ట్..!

వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ దీపికా పదుకొణె తన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరు ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న ‘రాకా’ సినిమాపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు దీపికా పదుకొణె చేసిన ఈ రిస్కీ యాక్షన్ ఎపిసోడ్స్ గురించిన లీక్స్ బయటకు రావడంతో సినిమాపై క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్‌కి చేరిపోయింది. బన్నీ మాస్ మేనరిజమ్స్.. అట్లీ లార్జర్ ద్యాన్ లైఫ్ టేకింగ్ తోడవ్వడం, దానికి తోడు దీపిక లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ విజువల్స్.. థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉత్తరాంధ్రకు కొత్త యుగం.....

భోగాపురం ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్...

పదవి కావాలంటే.. పని...

టీడీపీలో ప్రక్షాళనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారా.....

బుల్లెట్ ట్రైన్ రచ్చ.....

ముంబై-అహ్మదాబాద్ ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్...

మాజీ మంత్రి కోసం...

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గొర్రెల కాపరి...

క్రికెట్ చరిత్రలో ఓ...

క్రికెట్ చరిత్రలో ఓ మహోన్నత అధ్యాయానికి...

టార్గెట్ 2029.. వైసీపీకి...

2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన...

పోల్స్