Sunday, July 19, 2026 09:05 AM
Sunday, July 19, 2026 09:05 AM

పెరుగుతున్న నిరుద్యోగం.. భయపెడుతున్న నో జాబ్స్..!

దేశంలో నిరుద్యోగం అంతకంతకూ తీవ్రమవుతుంది. ఉన్నత చదువులు చదివిన వారికి కూడా అర్హతకు తగిన ఉద్యోగాలు లభించడం లేదు. ఎంబీఏ విద్యార్థుల్లో కేవలం 26 శాతం మంది, ఇంజినీర్లలో కేవలం 15 శాతం మంది, పట్టభద్రుల్లో కేవలం 16 శాతం మంది మాత్రమే ఉపాధి అవకాశాలు పొందుతున్నారని ‘అన్ స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2026’ వెల్లడించింది. ఈ లెక్కన 70 నుంచి 85 శాతం మంది విద్యార్థులు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని పేర్కొంది. పట్టభద్రులు కాని వారిలో 84 శాతం మంది నిరుద్యోగులుగా ఉండగా, 17 శాతం మందికి నియమకాలు ఆలస్యం కావడం లేదా చివరి నిమిషంలో రద్దు కావడం జరుగుతుందని తెలిపింది.

Also Read : కూటమిలో లోకల్ వార్ టెన్షన్..!

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 150కిపైగా కంపెనీలు కాలేజీలకు వచ్చినప్పుడు 2.9 రెట్లు అధికంగా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, 30 కన్నా తక్కువ కంపెనీలు వచ్చినప్పుడు మాత్రం చాలా తక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయని ఆ నివేదిక వివరించింది. గత ఏడాదిలోపు పట్టభద్రులైన వారిలో మెజారిటీ విద్యార్థులు ఇంతవరకు ఉపాధిని పొందలేకపోయారని తెలిపింది. కంపెనీలు కొత్తవారిని చేర్చుకుంటున్నప్పటికీ ఆచితూచి ఎంపిక చేస్తున్నాయని తెలిపింది. అవకాశాలు కొన్ని క్యాంపస్‌లలో, నైపుణ్య సమూహాలలో, నియామక పద్దతుల్లో కేంద్రీకృతమై ఉన్నాయని వివరించింది.

కార్మికులు, యువతలో నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో కేంద్ర సర్కార్ 2015లో పీఎం కౌశల్ వికాస్ యోజన స్కీమ్ ప్రవేశపెట్టింది. అదే ఏడాది స్కిల్ ఇండియా మిషన్ కూడా ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకాలన్నీ ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్, పీఎల్ఎస్ఎఫ్, ఐఎల్‌వో, అన్ స్టాప్ సంస్థలు విడుదల చేసిన నివేదికలను పరిశీలిస్తే ఇది నిజమే అని అంటున్నారు. మోదీ సర్కారు ఇప్పటికైనా ఉపాధి కల్పన పై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.

దేశంలో చదువుకు తగిన ఉద్యోగాలు చేస్తున్న పట్టభద్రులు కేవలం 8.25 శాతం మంది మాత్రమేనని హార్వర్డ్ బిజినెస్ స్కూలు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ సంస్థ ఇటీవలి అధ్యయనంలో వెల్లడించింది. 50 శాతానికి పైగా పట్టభద్రులు క్లర్క్, మెషీన్ ఆపరేటర్ వంటి ఏడో తరగతి స్థాయి ఉద్యోగాలను చేస్తున్నట్టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో తేలింది. దేశంలో 47 శాతం మందిలో కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు కొరవడినట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది.

Also Read : మాజీ మంత్రి కోసం ఎస్సై రిస్క్.. ఎస్పీ రిటర్న్ గిఫ్ట్..!

కేంద్ర ప్రభుత్వ ఉక్కు ఉత్పత్తి సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా .. సెయిల్ ఒప్పంద కార్మికులను గణనీయంగా తగ్గించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనిని అమలు చేయడం ప్రారంభించింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 40 శాతం ఒప్పంద కార్మికులను సంస్థ తొలగించనుంది. ఈ వార్త కార్మిక వర్గాల్లో సంచలనం సృష్టించింది. సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తమ జీవితాలు ఏం కావాలని వారు ఆందోళన చెందుతున్నారు. బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ఇన్‌ఛార్జి ప్రియా రంజన్ పేరిట ఏప్రిల్ 18న సంస్థ పంపిన ఒక అంతర్గత లేఖలో సమీకృత ఉక్కు కర్మాగారాలలోని పనులు, పనేతర విభాగాల్లోని ఒప్పంద కార్మికుల హేతుబద్ధీకరణకు సంబంధించిన లక్ష్యాల గురించి 2025లో జారీ చేసిన లేఖల ద్వారా తెలియజేసినట్టు పేర్కొన్నది.

అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి 12న రాసిన లేఖలో సెయిల్ ఇప్పటికే నిర్దేశించిన 20 శాతం లక్ష్యంలో 18.8 శాతం కాంట్రాక్టు కార్మికులను తగ్గించినట్టు తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా ఒప్పంద కార్మికుల హేతుబద్ధీకరణను కొనసాగించాల్సిన అవసరాన్ని తాజా లేఖ స్పష్టం చేసింది. దీని ప్రకారం 2027 మార్చి 31 నాటికి 40 శాతం ఒప్పంద కార్మికులను తగ్గించాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉత్తరాంధ్రకు కొత్త యుగం.....

భోగాపురం ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్...

పదవి కావాలంటే.. పని...

టీడీపీలో ప్రక్షాళనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారా.....

బుల్లెట్ ట్రైన్ రచ్చ.....

ముంబై-అహ్మదాబాద్ ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్...

మాజీ మంత్రి కోసం...

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గొర్రెల కాపరి...

క్రికెట్ చరిత్రలో ఓ...

క్రికెట్ చరిత్రలో ఓ మహోన్నత అధ్యాయానికి...

టార్గెట్ 2029.. వైసీపీకి...

2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన...

పోల్స్