Thursday, July 16, 2026 08:32 PM
Thursday, July 16, 2026 08:32 PM

‘వారణాసి’ గురించి ఆసక్తికర విషయాలు..!

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ‘వారణాసి’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గ్లోబల్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవేటెడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా ట్రెండ్ అవుతున్న ‘వారణాసి’ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా రేంజ్ ఏంటో తెలియజేస్తూ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సంచలన విషయాలు రివీల్ చేసింది. ఇంటర్నేషనల్ వేదికపై ఈ సినిమా గురించి పీసీ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి బ్రాండ్ వాల్యూని గ్లోబల్ మార్కెట్లో మరో మెట్టు ఎక్కించడానికి ‘వారణాసి’ సినిమా ముస్తాబవుతోంది.

Also Read : ఎంపీలకు షాక్ ఇచ్చిన స్పీకర్..!

వారణాసి సినిమాకు సంబంధించి ఏ చిన్న లీక్ వచ్చినా ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం. తాజాగా అంతర్జాతీయంగా ఎంతో పాపులర్ అయిన ‘హే జోనాస్’ పాడ్‌కాస్ట్‌లో ప్రియాంక చోప్రా పాల్గొని ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేసింది. తన భర్త నిక్ జోనస్ వారణాసి గురించి అడగ్గా.. రాజమౌళి లాంటి విజనరీ డైరెక్టర్‌తో తాను ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం 14 నెలలుగా వర్క్ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. జక్కన్న తన ప్రతి శిల్పాన్ని జాగ్రత్తగా చెక్కుతారని, అందుకే ఈ సినిమా ప్రొడక్షన్ ప్రాసెస్‌కు చాలా సమయం పడుతోందని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.

వారణాసి సినిమా ప్రపంచవ్యాప్తంగా సాగే ఒక ఎపిక్ టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ అని మరోసారి గుర్తు చేసింది. రాజమౌళి తనను సంప్రదించినప్పుడే ఈ విభిన్నమైన కాన్సెప్ట్ లైన్ చెప్పి ఒప్పించారని పేర్కొంది. కాలంతో పాటు వివిధ దేశాల చుట్టూ తిరిగే ఈ కథలో తాను అద్భుతమైన స్లో మోషన్ జంప్స్, రిస్కీ యాక్షన్ స్టంట్స్ చాలా కష్టపడి చేసినట్లు హింట్ ఇచ్చింది. ప్రియాంక గతంలో చెప్పిన విషయాల కంటే ఈ పాడ్‌కాస్ట్‌లో రివీల్ చేసిన పాయింట్స్ పూర్తిగా ఫ్రెష్‌గా ఉండటంతో సినిమాపై క్యూరియాసిటీ పీక్స్‌కి చేరింది. ప్రియాంక చోప్రా సినీ కెరీర్‌ ప్రారంభమై 24 ఏళ్లు దాటింది. ఇన్నేళ్ల కెరీర్‌లో చేసిన సినిమాలతో పోల్చితే ఈ సినిమా చాలా స్పెషల్‌ అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.

Also Read : టీటీడీ కీలక సమాచారం లీక్..? అసలేం జరిగింది..?

తన కెరీర్‌లోనే ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా ప్రియాంక పేర్కొనడం చూస్తే సినిమా స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వారణాసి చిత్రం హాలీవుడ్‌ సినిమాలను మించి ఉంటుందనే నమ్మకాన్ని మహేష్ బాబు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో నిలిచి పోయే సినిమాగా వారణాసి నిలవబోతుంది. రాజమౌళి ఏ సినిమా చేసినా ఆ హీరోలకు, హీరోయిన్స్‌కి కెరీర్‌లో నిలిచి పోయే సినిమా, లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అన్నట్లుగా ఆ సినిమాలు ఉంటాయి. వారణాసి కూడా మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రాకు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అన్నట్లు నిలవడం ఖాయం. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబును ఢీకొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకూమారన్ నటిస్తున్నారు. ఇద్దరి మధ్య సాగే సీన్లు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను ఇండియన్ నేటివిటీకి తగినట్టుగా, గ్లోబల్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా అద్భుతంగా మలిచారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన అందించబోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెడతాయని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధికంగా 1200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న వారణాసి చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అవి అక్రమ కేసులే.....

ఏపీలో జగన్‌ హయాంలో గతంలో ఎన్నడూ...

గల్లా జయదేవ్ కు...

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో...

పోలవరం-బనకచర్ల వివాదం.. తెలంగాణ...

తెలుగు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా...

ఏపీలో ఎన్నికల సందడి.....

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి...

టీటీడీ కీలక సమాచారం...

తిరుమల తిరుపతి దేవస్థానం ఐటీ విభాగం...

రేవంత్ కు పవన్...

తెలంగాణలోని షాద్‌ నగర్‌ లో పోక్సో...

పోల్స్