Thursday, July 16, 2026 01:12 AM
Thursday, July 16, 2026 01:12 AM

స్టార్ హీరో మూడో పెళ్లిపై మతం రచ్చ.. అసలేం జరిగింది..?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇటీవలే బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త గౌరీ స్ప్రాట్‌ ను మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జూలై 5, న వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా, తాజాగా ఈ పెళ్లిపై ఒక పెద్ద వివాదం రాజుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా చౌదరి ఇఫ్రాహిమ్ హుస్సేన్ ఈ అంతర్మత వివాహాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆమిర్ ఖాన్‌పై ఫత్వా జారీ చేశారు. షరియా చట్టం ప్రకారం ఒక ముస్లిం పురుషుడు ఇస్లామేతర విశ్వాసాలకు చెందిన స్త్రీని వివాహం చేసుకోవడం నిషిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

Also Read : అమరావతిలో కూటమి కీలక సమావేశం..!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో సదరు మౌల్వీ మాట్లాడుతూ, ఇస్లాంలో ఇలాంటి వివాహాలకు అనుమతి లేదని, ఇటువంటి బంధాల్లోకి అడుగుపెట్టే వారు పాపానికి ఒడిగట్టినట్లేనని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఆమిర్ ఖాన్ చేసుకున్న ఈ మూడో పెళ్లి వల్ల షరియా, ఇస్లాం ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌ గా మారగా, నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ వివాదంపై అటు ఆమిర్ ఖాన్ గానీ, ఇటు ఆయన టీమ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read : కాంగ్రెస్‌కు రాములమ్మ గుడ్ బై..?

నిజానికి, ఈ వివాదం తెరపైకి రాకముందే ఆమిర్ ఖాన్ తన పెళ్లిపై వస్తున్న లవ్ జిహాద్ ఆరోపణలను ఖండించారు. తమ కుటుంబం ఎల్లప్పుడూ అన్ని మతాల బంధాలను గౌరవిస్తుందని, తన మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావుతో పాటు ప్రస్తుత భార్య గౌరీ స్ప్రాట్ కూడా పెళ్లి కోసం మతం మార్చుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తన మూడు వివాహాలు కూడా చట్టబద్ధమైన సివిల్ మ్యారేజెస్ అని ఆయన గతంలోనే పేర్కొన్నారు. అయినప్పటికీ యూపీ మౌల్వీ ఫత్వా జారీ చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ కు పవన్...

తెలంగాణలోని షాద్‌ నగర్‌ లో పోక్సో...

పవన్ సంచలన నిర్ణయం.....

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్...

టీడీపీలో ప్రక్షాళన.. వారికి...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి పరిపాలనలో...

ఎన్టీఆర్ : కొత్త...

నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా...

తెలంగాణా ఫోన్ ట్యాపింగ్...

గత ఆరేళ్లుగా తెలంగాణ రాజకీయ, అధికార...

చంద్రబాబుకు ఉన్న నీటి...

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్...

పోల్స్