Tuesday, August 25, 2026 02:00 AM
Tuesday, August 25, 2026 02:00 AM

క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. భారత్‌ లో ‘బిగ్ బాష్ లీగ్’..!

క్రికెట్ ప్రేమికులకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఒక ఊహించని మెగా సర్ప్రైజ్ ఇచ్చింది. ఆస్ట్రేలియాలో అత్యంత ప్రజాదరణ పొందిన బిగ్ బాష్ లీగ్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ లీగ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియా వెలుపల ఒక మ్యాచ్‌ను నిర్వహించబోతున్నారు. అదీ ప్రపంచ క్రికెట్‌కు గుండెకాయ లాంటి భారతదేశంలో ఈ మ్యాచ్ జరగనుండటం విశేషం. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఐకానిక్ చేపాక్ స్టేడియం వేదికగా బిగ్ బాష్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్‌ను నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Also Read : 50 దాటిన మహిళలు ఈ విషయంలో జాగ్రత్త..!

ఈ ఏడాది డిసెంబర్ 12వ తేదీన ఈ చారిత్రాత్మక ప్రారంభ మ్యాచ్ జరగనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఈ కీలకమైన క్రీడా అప్‌డేట్‌ను అధికారికంగా వెల్లడించారు. భారత్-ఆస్ట్రేలియా దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను, క్రీడా బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌ను భారత్‌కు తీసుకురావడం ద్వారా ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించవచ్చని ఆస్ట్రేలియా క్రికెట్ ప్రతినిధులు భావిస్తున్నారు.

Also Read : మెగా 158 కోసం మెగాస్టార్ డెడికేషన్..!

సాధారణంగా ఐపీఎల్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ ఉన్న లీగ్స్‌లో బిగ్ బాష్ లీగ్ ఒకటి. ఇప్పుడు ఈ టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌ చెన్నైలో జరగనుండటంతో భారతీయ క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎంతో ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ నెలలో జరగబోయే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సంబంధించిన జట్లు, ఆటగాళ్ల వివరాలను మరియు టికెట్ల అమ్మకాల షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు...

వైసీపీ పాలనలో జరగని స్కామ్‌లు, జరగని...

వైసీపీ టైం లో...

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం...

విశాఖ స్టీల్ ప్లాంట్.....

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం...

పథకం మంచిదే.. కానీ...

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది...

నాకేం సంబంధం లేదు.....

కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

కారుమూరికి ఈడీ షాక్..!

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక...

పోల్స్