Tuesday, November 24, 2026 04:45 PM
Tuesday, November 24, 2026 04:45 PM

భూమన ఫేక్ ప్రచారానికి ఆధారాలతో దిమ్మతిరిగే కౌంటర్..!

కడప-రేణిగుంట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆంజనేయపురంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వం కూల్చివేస్తోందంటూ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, వైసీపీ చేస్తున్న ఆరోపణలపై దేవాదాయ శాఖ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. వైసీపీ చేస్తున్నది పూర్తిగా అవాస్తవ ప్రచారమని స్పష్టం చేస్తూ, క్షేత్రస్థాయి వాస్తవాలను తెలిపే ఫోటోలు, అధికారిక డాక్యుమెంట్లను దేవాదాయ శాఖ విడుదల చేసింది.

Also Read : కార్యకర్తే కింగ్.. కర్నూలు ZP ఛైర్మన్‌గా ఉలిగయ్య

జాతీయ రహదారి నిర్మాణం కోసం దేవాలయాన్ని తరలించే అంశంపై గత కొన్ని నెలలుగా గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకులు, అధికారుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయని, అందరి పూర్తి అంగీకారంతోనే ఆలయాన్ని పక్కకు నిర్మించాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. ఎటువంటి బలవంతపు కూల్చివేతలు జరగలేదని, రెండు రోజుల క్రితమే అర్చకులు మరియు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మూలమూర్తిని పాత ఆలయం నుంచి తరలించారని అధికారులు ఆధారాలతో సహా నిరూపించారు.

Also Read : డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియాకు డూ ఆర్ డై..!

ఆలయానికి పక్కనే ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మించిన నూతన నిర్మాణంలో మూలమూర్తులను శాస్త్రోక్తంగా తాత్కాలిక ప్రతిష్టాపన చేసినట్లు తెలిపారు. హైవే నిర్మాణంలో భాగంగా దేవాలయానికి చెందిన 10 సెంట్ల భూమిని సేకరించినందుకు గాను, నూతన ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం భారీగా నిధులు మరియు స్థలాన్ని కేటాయించింది. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీనే ఆంజనేయ స్వామి దేవాలయ ఈవో ఖాతాలో రూ. 59 లక్షల 30 వేలను అధికారులు జమ చేశారని, అంతేకాకుండా నూతన దేవాలయ నిర్మాణానికి ఆ పక్కనే ఏకంగా 50 సెంట్ల భూమిని కూడా కేటాయించినట్లు డాక్యుమెంట్లతో సహా స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కుట్రపూరితంగా చేస్తున్న ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని దేవాదాయ శాఖ విజ్ఞప్తి చేసింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

యలహంక ఆస్తులు.. వివేకా...

బెంగళూరులోని యలహంక పరిధిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి...

రహదారి భద్రతలో ఏపీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళగిరి కేంద్రంగా ఏర్పాటు...

నాకేం సంబంధం లేదు.....

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్...

ఆస్ట్రేలియా మరో బాల్...

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును మరోసారి బాల్...

ఆసియా పవర్ ఇండెక్స్...

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ మేధో...

పులివెందుల చరిత్రలో కొత్త...

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

పోల్స్