ఉదయాన్నే అల్పాహారంగా చాలా మంది ఇష్టపడే ఓట్స్‌ను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఎయిమ్స్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి వెల్లడించారు. ఓట్స్‌లో సహజంగా ఉండే బీటా-గ్లూకాన్, ఇతర ఫైబర్ పదార్థాలు గుండె ఆరోగ్యం నుంచి రక్తంలో చక్కెర స్థాయిలు, జీర్ణక్రియ వరకు అనేక విధాలుగా మేలు చేస్తాయని ఆయన వివరించారు.
Also Read : ఎక్స్‌ప్లోరర్ పెద్దపులి బోనుకు చిక్కుతుందా..? అసలేం జరుగుతుంది..?
రోజూ ఓట్స్ తినడం వల్ల శరీరంలో కలిగే ఐదు ప్రధాన మార్పులను డాక్టర్ సేథి స్పష్టం చేశారు. ఓట్స్‌లో ఉండే కరిగే ఫైబర్ అయిన బీటా-గ్లూకాన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె సమస్యల ముప్పును నివారిస్తుంది. అలాగే ఇందులోని పీచు పదార్థం గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేయడం ద్వారా, భోజనం చేసిన వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థ విషయానికి వస్తే, ఓట్స్‌లో ఉండే ప్రీబయోటిక్ ఫైబర్లు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు..
Also Read : కార్యకర్తే కింగ్.. కర్నూలు ZP ఛైర్మన్‌గా ఉలిగయ్య
పోషణ అందించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా, ఓట్స్ తిన్న తర్వాత ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలగడం వల్ల మధ్యమధ్యలో అనవసరమైన చిరుతిళ్లు తినే అలవాటు తగ్గుతుంది. తగినంత ఫైబర్ అందడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా సాధారణ ప్రేగు కదలికలకు ఇది ఎంతో తోడ్పడుతుందని డాక్టర్ సేథి పేర్కొన్నారు. అయితే, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.


