Tuesday, November 24, 2026 04:56 PM
Tuesday, November 24, 2026 04:56 PM

ఈరోజు రాశి ఫలితాలు (24-11-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తిక మాసం, శుక్ల పక్షం.. 24-11-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి.
————————–

వృషభం

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఇంటా బయట కొందరి ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
————————–

మిధునం

బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో చిన్నపాటి వివాదాలు కలగుతాయి.
————————–

కర్కాటకం

కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ పడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
————————–

సింహం

వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ముఖ్యమైన పనులలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
————————–

కన్య

దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంటా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
————————–

తుల

వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు ప్రారంభించక పోవడం మంచిది. జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు ఉంటాయి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది.
————————–

వృశ్చికం

నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలించవు. వృధా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
————————–

ధనస్సు

వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
————————–

మకరం

నూతన ఋణ ప్రయత్నాలు చెయ్యకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన పరంగా ఒడిదుడుకులు అధికమౌతాయి. దీర్ఘకాలిక ఋణాల ఒత్తిడి కొంత పెరుగుతుంది.
————————–

కుంభం

ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి.
————————–

మీనం

ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. వ్యాపారాల్లో నూతన విధానాలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. దూర ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు.
————————–

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహన కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

యలహంక ఆస్తులు.. వివేకా...

బెంగళూరులోని యలహంక పరిధిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి...

రహదారి భద్రతలో ఏపీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళగిరి కేంద్రంగా ఏర్పాటు...

నాకేం సంబంధం లేదు.....

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్...

ఆస్ట్రేలియా మరో బాల్...

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును మరోసారి బాల్...

ఆసియా పవర్ ఇండెక్స్...

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ మేధో...

భూమన ఫేక్ ప్రచారానికి...

కడప-రేణిగుంట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా...

పోల్స్