Saturday, October 10, 2026 05:00 AM
Saturday, October 10, 2026 05:00 AM

50 దాటిన మహిళలు ఈ విషయంలో జాగ్రత్త..!

50 ఏళ్లు దాటిన మహిళల్లో కండరాల బలం తగ్గడం, ఎముకలు బలహీనపడటం సహజం. దీనివల్ల నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు రావడం, నడిచేటప్పుడు శరీరం బ్యాలెన్స్ తప్పడం లాంటి సమస్యలు వస్తాయి. ఈ వయసు సంబంధిత మార్పులను అడ్డుకుని, యాక్టివ్‌ గా ఉండటానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. మహిళలు ఫిట్‌ గా ఉండటానికి రోజువారీగా చేయాల్సిన కొన్ని ముఖ్యమైన వ్యాయామాలు ఉన్నాయి. స్క్వాట్స్ చేయడం వల్ల తొడలు, నడుము కండరాలు బలోపేతమై కుర్చీలోంచి లేవడం, మెట్లు ఎక్కడం తేలికవుతుంది.

Also Read : మీ కొలెస్ట్రాల్ టెస్ట్ సరైనదేనా..?

చేతులు, భుజాల బలానికి వాల్ పుష్-అప్స్ బాగా ఉపయోగపడతాయి. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే నడుము నొప్పిని తగ్గించడానికి వెల్లకిలా పడుకుని నడుము పైకి లేపే గ్లూట్ బ్రిడ్జెస్ వ్యాయామం సహాయపడుతుంది. వీటితో పాటు, నిటారుగా నడవడానికి తేలికపాటి డంబెల్స్‌ తో డంబెల్ రోస్ మరియు చేతుల కదలికల కోసం ఓవర్‌ హెడ్ ప్రెస్ చేయాలి. శరీర సమతుల్యత పెరిగి కింద పడకుండా ఉండటానికి చిన్న పీటపై ఎక్కే స్టెప్-అప్స్ ఉపయోగపడతాయి. పొట్ట, వీపు కండరాలు ఒకేసారి గట్టిపడటానికి మోచేతులపై శరీరాన్ని నిలబెట్టే ప్లాంక్ వ్యాయామం చాలా మంచిది.

Also Read : హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు అలర్ట్..!

ఈ వ్యాయామాల వల్ల ఎముకల సాంద్రత పెరగడమే కాకుండా శరీరంలో మెటబాలిజం మెరుగై బరువు అదుపులో ఉంటుంది. అలాగే మంచి నిద్ర పడుతుంది, రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అయితే, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మొదటిసారి వ్యాయామం చేసేవారు ఖచ్చితంగా డాక్టర్ లేదా ఫిట్‌నెస్ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే వీటిని ప్రారంభించాలి. ఈ స్ట్రెంగ్త్ వ్యాయామాలను వారానికి కనీసం 2 లేదా 3 రోజులు చేస్తే సరిపోతుంది. కండరాలకు విశ్రాంతి ఇవ్వడం కూడా అంతే ముఖ్యం.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

మందులకు లొంగని మలేరియాకు...

వైద్య రంగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ...

బ్రేకింగ్: రేపు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో...

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి....

పోల్స్