Thursday, July 16, 2026 08:44 PM
Thursday, July 16, 2026 08:44 PM

అదిరిపోయే మైలేజ్‌తో మార్కెట్‌లోకి కియా సిరోస్ ఎలక్ట్రిక్ కార్..!

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా దేశీయ మార్కెట్లోకి తమ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా సిరోస్ ఈవీని అధికారికంగా ఆవిష్కరించింది. ఈ నెల చివర్లో మార్కెట్లోకి అధికారికంగా విడుదల కానున్న ఈ కారు కోసం సంస్థ అప్పుడే బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. ఈ మోడల్‌ను సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 25,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని కియా స్పష్టం చేసింది. మొత్తం ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు ఇటు డిజైన్, అటు ఫీచర్ల పరంగా విప్లవాత్మక మార్పులతో వస్తోంది.

Also Read : అవి అక్రమ కేసులే.. ఆధారాల్లేవ్‌.. చంద్రబాబుకి సుప్రీం క్లీన్‌ చిట్‌..!

ఈ సరికొత్త కియా సిరోస్ ఈవీ కారును రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో కస్టమర్లకు అందిస్తున్నారు. ఇందులో 42 కేవీహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల వేరియంట్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 443 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సంస్థ పేర్కొంది. అలాగే, మరింత శక్తివంతమైన 51.4 కేవీహెచ్ బ్యాటరీ ప్యాక్ గల వేరియంట్ ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం గరిష్టంగా 526 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కియా ప్రతినిధులు వెల్లడించారు. ఒకవేళ 100 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగిస్తే, కేవలం 39 నిమిషాల్లోనే ఈ కారు బ్యాటరీని 10 శాతం నుండి 100 శాతం వరకు ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read : టీం ఇండియాలో కీలక మార్పులు..?

ఇక ఈ ఎలక్ట్రిక్ కారు ఫీచర్ల విషయానికి వస్తే, క్యాబిన్ లోపల 12.3 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 12.3 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో కూడిన ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీటితో పాటు వాతావరణ నియంత్రణ కోసం మరో 5 ఇంచుల ప్రత్యేక డిస్‌ ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, 8-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అధునాతన లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత పరంగా ఈ కారులో లెవెల్-2 ఏడీఏఎస్ టెక్నాలజీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అత్యాధునిక రక్షణ ఫీచర్లను కూడా అమర్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అవి అక్రమ కేసులే.....

ఏపీలో జగన్‌ హయాంలో గతంలో ఎన్నడూ...

గల్లా జయదేవ్ కు...

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో...

పోలవరం-బనకచర్ల వివాదం.. తెలంగాణ...

తెలుగు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా...

ఏపీలో ఎన్నికల సందడి.....

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి...

టీటీడీ కీలక సమాచారం...

తిరుమల తిరుపతి దేవస్థానం ఐటీ విభాగం...

రేవంత్ కు పవన్...

తెలంగాణలోని షాద్‌ నగర్‌ లో పోక్సో...

పోల్స్