తిరుమల తిరుపతి దేవస్థానం ఐటీ విభాగం మాజీ జనరల్ మేనేజర్ సందీప్‌రెడ్డి నియామక వ్యవహారంపై ఏపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై సిఐడీ విచారణ జరపగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ నియామకం మొదటి నుంచి అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలో, ఆయన నియామకం జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు టీటీడీ ఐటీ విభాగంలో చోటుచేసుకున్న పరిణామాలు, తీసుకున్న నిర్ణయాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని టీటీడీ ఉన్నతాధికారులు సీఐడీని ఆదేశించారు.
Also Read : ఎస్సీలంటే అంత కోపం ఎందుకు జగన్..?
శ్రీవారి భక్తుల వ్యక్తిగత సమాచారంతో ముడిపడి ఉన్న ఐటీ విభాగంలో ఇలాంటి అక్రమాలు జరిగాయనే వార్త ఇప్పుడు భక్తులలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించిన నేపథ్యాన్ని పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు నియామకాలపై అంతర్గత విచారణలు చేపట్టారు. అందులో భాగంగానే 2024 ఆగస్టులో టీటీడీ విజిలెన్స్ విభాగం ఉన్నతాధికారులకు ఒక ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో సందీప్‌రెడ్డి నియామకం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విజిలెన్స్ స్పష్టం చేసింది.
Also Read : మార్కెట్ లోకి సరికొత్త కియా సెల్టోస్ ఎంట్రీ..!
ఐటీ జీఎం వంటి అత్యంత కీలకమైన మరియు బాధ్యతాయుతమైన పదవికి ఉండాల్సిన అర్హతలు, అనుభవం సందీప్‌రెడ్డికి లేకపోయినా, అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మరియు రాజకీయ సిఫార్సుల వల్లే నిబంధనలను పక్కనబెట్టి ఆయనకు ఆ పోస్టు కట్టబెట్టారని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా తేల్చారు. సీఐడీ అధికారులు ప్రస్తుతం ఈ విచారణను రెండు, మూడు ప్రధాన కోణాలలో వేగవంతం చేస్తున్నారు. అందులో మొదటిది మరియు అత్యంత ప్రమాదకరమైనది కీలక సమాచారం లీకేజీ అంశం అలాగే తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు, లడ్డూ ప్రసాదం బుకింగ్స్, భక్తుల ఆధార్ మరియు బ్యాంక్ వివరాలతో కూడిన టీటీడీ ఐటీ సర్వర్ల భద్రతకు సందీప్‌రెడ్డి హయాంలో ముప్పు వాటిల్లిందా..? టీటీడీకి సంబంధించిన అంతర్గత మరియు రహస్య సమాచారాన్ని ఏమైనా ప్రైవేట్ వ్యక్తులకు లేదా బయటి సంస్థలకు చేరవేశారా..? అనే అనుమానాలపై సీఐడీ లోతుగా ఆరా తీస్తోంది.

