Friday, July 17, 2026 02:56 AM
Friday, July 17, 2026 02:56 AM

ఎస్సీలంటే అంత కోపం ఎందుకు జగన్..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలు.. ఠక్కున గుర్తుకు వచ్చేది శవ రాజకీయం అనే మాట అంటారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. అసలు వైసీపీ మొదలైందే శవాల పైన అనేది టీడీపీ నేత ఆరోపణ. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ తండ్రి శవం పక్కనే సంతకాలు సేకరించారనేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రధాన ఆరోపణ. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభానికి తొలి అడుగు కూడా ఓదార్పు యాత్రతోనే పడిందనేది సన్నిహితుల మాట. వైఎస్ఆర్ మరణం తట్టుకోలేక చాలా మంది చనిపోయారని.. వారిని ఓదార్చేందుకే ఓదార్పు యాత్ర అంటూ అప్పట్లో జగన్ ప్రకటించారు. కానీ ఆ యాత్రనే తన రాజకీయలకు పునాదిగా వాడుకున్నారు.

Also Read : రేవంత్ కు పవన్ సంచలన లేఖ.. వాళ్లకు బెయిల్ వద్దు..!

వైసీపీ ఆరంభం నుంచి డబుల్ స్టాండ్‌తో ఉందనేది బహిరంగ రహస్యం. జగన్ అధికారం కోసం ఒక మాట.. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. మళ్లీ ఓట్ల కోసం మరో మాట మాట్లాడటం ఇప్పుడు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. అధికారంలోకి వచ్చే మందు 2017 – 18లో చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో, 2019 ఎన్నికల ప్రచారంలో కూడా ప్రతి విషయంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు.. అంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం కన్వర్టెడ్ క్ట్రిస్టియన్స్ కావడంతో.. దళిత క్ట్రిస్టియన్లు అంతా జగన్ మావాడు అని నమ్మి ఓట్లు వేశారు. ఇంకా చెప్పాలంటే.. ఇప్పటికీ దళిత క్రిస్టియన్లు జగన్ వైపే ఎక్కువగా ఉన్నారు కూడా.

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. తన కోటరీలో అంతా రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యమైన పదవులన్నీ రెడ్డి నేతలకే ఇచ్చారు. సీఎస్, డీజీపీ వంటి పదవులు కూడా రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించారు. అంతే తప్ప.. ఎస్సీ నేతలకు సరైన గుర్తు కూడా ఇవ్వలేదు. ఇందుకు ప్రధాన ఉదాహరణ.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే 2020లో కరోనా కారణంగా తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు కరోనా వల్ల మృతి చెందారు. అలాగే బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ ఎమ్మెల్యే గుంతోటి వెంకట సుబ్బయ్య కూడా అనారోగ్యం కారణంగా మృతి చెందారు.

ఈ ఇద్దరు ఎస్సీ నేతలే. పైగా ప్రజా ప్రతినిధులే. కానీ కనీసం ఒక్కరి పార్థివ దేహాన్ని కూడా జగన్ సందర్శించలేదు. వారి కుటుంబాలని ఫోన్‌లో పరామర్శించారు. తర్వాత దుర్గా ప్రసాద్ రావు స్థానంలో గురుమూర్తికి ఎంపీ టికెట్ ఇచ్చారు. వెంకట సుబ్యయ్య స్థానంలో ఆయన సతీమణి డాక్టర్ సుధకు టికెట్ ఇచ్చారు. ఉప ఎన్నిక బీ ఫారం ఇచ్చేటప్పుడు మాత్రమే డాక్టర్ సుధను జగన్ పరామర్శించారు తప్ప.. అప్పటి వరకు కడప జిల్లాలో పర్యటించినప్పుడు కూడా.. బద్వేలు వైపు కన్నెత్తి చూడలేదు. నా ఎస్సీ, నా బీసీ అని చెప్పే మాటలు పైకేనా అని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయినా సరే.. వైసీపీ నేతలు కనీస వివరణ ఇవ్వలేదు.

Also Read : మార్కెట్‌ లోకి సరికొత్త కియా సెల్టోస్ ఎంట్రీ..!

అయితే ఇప్పుడు మాత్రం జగన్ తీరు పూర్తిగా మారిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సొంత పార్టీకి చెందిన సిట్టింగ్ ఎస్సీ ఎంపీ, ఎమ్మెల్యే చనిపోయినప్పుడు కనీసం అటు వైపు కన్నెత్తి కూడా చూడని జగన్.. ఇప్పుడు మాత్రం కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి మృతి విషయంలో మరోలా వ్యవహరించారు. నేరుగా కిర్లంపూడి వెళ్లారు. ముద్రగడకు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరో అడుగు ముందుకు వేశారు. ముద్రగడ పాడె కూడా మోశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి జగన్ తన సొంత కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఇలా వ్యవహరించలేదు. తండ్రి వైఎస్ఆర్, బాబాయ్ వైఎస్ వివేకా, మామ గంగిరెడ్డి.. సహా సొంత కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు కూడా దూరంగా ఉండి నివాళి అర్పించారు తప్ప.. పాడె మోయలేదు. కానీ ముద్రగడ విషయంలో మాత్రం ఇలా ఎందుకు అంటే.. కేవలం కాపు ఓట్ల కోసమే అని రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైకి నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెబుతారు తప్ప.. వారిని కనీసం దగ్గరకు రానివ్వని జగన్.. ముద్రగడ విషయంలో ఇలా ప్రత్యేక శ్రద్ధ చూపించారంటే.. ఇది కేవలం కాపు ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నం అంటున్నారు. మరి కాపులు, ముఖ్యంగా ఎస్సీలు ఈ డబుల్ స్టాండ్ శవ రాజకీయాలను ఎలా తీసుకుంటారో.. ఎన్నికల్లో ఎవరికి ఓట్లు వేస్తారో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అవి అక్రమ కేసులే.....

ఏపీలో జగన్‌ హయాంలో గతంలో ఎన్నడూ...

గల్లా జయదేవ్ కు...

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో...

పోలవరం-బనకచర్ల వివాదం.. తెలంగాణ...

తెలుగు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా...

ఏపీలో ఎన్నికల సందడి.....

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి...

టీటీడీ కీలక సమాచారం...

తిరుమల తిరుపతి దేవస్థానం ఐటీ విభాగం...

రేవంత్ కు పవన్...

తెలంగాణలోని షాద్‌ నగర్‌ లో పోక్సో...

పోల్స్